NCW Asks Twitter India to Block Hero Siddharth's Account over Tweet On Saina Nehwal's Post: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ (Saina Nehwal)ను టార్గెట్ చేస్తూ హీరో సిద్ధార్థ్ (Hero Siddharth) ఇటీవల చేసిన ట్వీట్ ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతోంది. సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సైనాపై సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఆడవారిని అవమానపరిచేలా ఉన్నాంటూ శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేదితో సహ పలువురు ప్రముఖులు ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు. సిద్ధార్థ్ ట్వీట్‌పై తాజాగా జాతీయ మహిళ కమిషన్ (NCW) కూడా సిద్దార్థ్‏కు నోటిసులు జారీ చేసింది. అతడి అకౌంట్‌ను వెంటనే బ్లాక్ చేయండి అని కోరింది. విషయంలోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనవరి 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పంజాబ్ పర్యటనలో భాగంగా ఫిరోజ్ పూర్‌కు వెళ్లారు. రోడ్డు మార్గంలో వెళ్తున్న ప్రధాని కాన్వాయ్ ని రైతులు 20 నిమిషాల పాటు అడ్డిగించి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో మోదీ భద్రత లోపం గురించి సోషల్ మీడియా పెద్ద దుమారమే రేగింది. ఈ విషయంపై సైనా నెహ్వాల్‌ ట్విట్టర్ (Saina Twitter) వేదికగా స్పందిస్తూ.. 'ప్రధాని భద్రత విషయంలో రాజీపడితే ఏ దేశం కూడా సురక్షితంగా ఉండదు. అరాచకవాదులు ప్రధానిని టార్గెట్ చేశారు. ఈ పిరికి వాళ్ల దాడిని నేను ఖండిస్తున్నాను' అని ట్విట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. 


Also Read: Simbhu - Nidhi Agarwal: స్టార్ హీరోతో నిధి అగర్వాల్‌ సహజీవనం.. ఏకంగా అతని ఇంటికే మకాం మార్చిన ఇస్మార్ట్ బ్యూటీ!!


సైనా నెహ్వాల్‌ చేసిన ట్వీట్‌ను హీరో సిద్ధార్థ్ రీట్వీట్ (Siddharth Tweet) చేస్తూ.. 'కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్. థ్యాంక్స్ గాడ్.. ఇండియాను రక్షించే వారు ఉన్నారు. షేమ్ ఆన్ యూ రిహన్నా' అని పేర్కొన్నాడు. సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌ను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఖండించారు. దాంతో సిద్ధార్థ్ ఈరోజు మరో ట్వీట్ చేశాడు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని.. కాక్ అండ్ బుల్ కథలు చెప్పారన్న ఉద్దేశ్యాన్ని సిద్ధార్థ్ తన ట్వీట్‌లో వ్యక్తం చేశాడు. తన ట్వీట్లను మరో విధంగా అర్ధం చేసుకోవద్దని, ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదన్నాడు. తాను ఎవరిని అవమానించలేదని ట్వీట్‌లో సిద్ధార్థ్ పేర్కొన్నాడు. 




జాతీయ మహిళా కమిషన్ కూడా సిద్ధార్థ్‌ ట్వీట్‌పై సీరియస్ అయి నోటీసులు జారీ చేసింది. సిద్దార్థ్ చేసిన పోస్ట్ స్త్రీ ద్వేషం, మహిళల గౌరవానికి అవమానం కలిగించే విధంగా ఉందని పేర్కోంది. ఛైర్‌పర్సన్ రేఖా శర్మ ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు చేసి నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహారాష్ట్రకు లేఖ రాశారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పదజాలం వాడినందుకు సిద్ధార్థ్ అకౌంట్‌ను బ్లాక్ చేయండని కోరారు. 


Also Read: RGV vs Perni Nani: సినిమా టికెట్ల అంశంపై మంత్రి పేర్ని నానితో ముగిసిన ఆర్జీవీ భేటీ




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి