NED Vs BAN Highlights: వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. నెదర్లాండ్స్ చేతిలో బంగ్లా చిత్తు
Netherlands vs Bangladesh World Cup 2023: బంగ్లాదేశ్‌పై 87 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది నెదర్లాండ్స్. బ్యాటింగ్‌లో స్వల్ప స్కోరే చేసినా.. నెదర్లాండ్స్ బౌలర్లు చక్కగా రాణించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ.. బంగ్లాను ముప్పుతిప్పలు పెట్టారు.
Netherlands vs Bangladesh World Cup 2023: ప్రపంచ కప్ 2023లో మరో సంచలనం నమోదైంది. తమ కంటే బలమైన బంగ్లాదేశ్ టీమ్‌ను 87 పరుగుల తేడాతో ఓడించింది నెదర్లాండ్స్. ఇప్పటికే సౌతాఫ్రికాకు షాకిచ్చిన నెదర్లాండ్స్.. తాజాగా బంగ్లాకు ఝలక్ ఇచ్చి పెద్ద జట్లకు హెచ్చరికలు పంపించింది. శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ జట్టు 142 పరుగులకే కుప్పకూలింది. నెదర్లాండ్స్ బ్యాట్స్‌మెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 68 పరుగులతో రాణించగా.. పాల్ వాన్ మీకెరెన్ 4 వికెట్లు పడగొట్టి బంగ్లా పతనంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో నెదర్లాండ్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. ఈ ప్రపంచకప్‌లో రెండో విజయం.
230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ లిటన్ దాస్ (3), తంజీద్ హసన్ (15) వెంటవెంటనే ఔట్ అయ్యారు. మెహదీ హసన్ మిరాజ్ (35) కాసేపు జట్టును ఆదుకున్నా.. నెదర్లాండ్స్ బౌలర్లు ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (5), ముష్ఫికర్ రహీమ్ (1), మెహదీ హసన్ (17), ముస్తాఫిజుర్ రెహమాన్ (20), తస్కిన్ అహ్మద్ (11) పరుగులు చేశారు. దీంతో బంగ్లా మొత్తం 42.2 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటై.. 87 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది.
అంతకుముందు టాస్ గెలిచి నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆరంభంలో తడపడింది. ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ (3), మాక్స్ ఓడ్ (0) విఫలమయ్యారు. కెప్టెన్ ఎడ్వర్డ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 89 బంతుల్లో 68 పరుగులు చేశాడు. బరేసి (41), ఇంగ్లెర్‌బెచ్ట్ (35) రాణించారు. చివరకు నెదర్లాండ్స్ 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్, మెహదీ హసన్, ఇస్లాం, తస్కిన్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఆరు మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ కేవలం ఒక మ్యాచ్‌లో గెలిచి.. సెమీస్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది.
Also Read: 7th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వం బంపర్ బహుమతి.. 7వ వేతన సంఘం అమలుపై కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook