NED vs ENG: ప్రపంచ రికార్డు సృష్టించిన ఇంగ్లండ్.. వన్డేల్లో అత్యధిక స్కోర్!
England set new ODI world record with score of 498. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసిన జట్టుగా నిలిచింది.
England set new ODI world record with score of 498 vs Netherlands: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసిన జట్టుగా నిలిచింది. శుక్రవారం (జూన్ 17) ఆమ్‌స్టెల్‌వీన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో 498 పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దాంతో వన్డే క్రికెట్ చరిత్రలో తన పేరిటే ఉన్న అత్యధిక స్కోర్ రికార్డును ఇంగ్లండ్ అధిగమించింది. అంతకుముందు 2018లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 481 పరుగుల భారీ స్కోర్ చేసింది.
నెదర్లాండ్స్‌పై వన్డేలో అత్యధికంగా 498 పరుగులతో కొత్త రికార్డు నెలకొల్పిన ఇంగ్లండ్.. ఇంతకుముందు ఆస్ట్రేలియాపై 481 రన్స్, పాకిస్థాన్‌పై 444 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌పై శ్రీలంక 443 రన్స్, వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 439 పరుగులు, ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 438 రన్స్, భారత్‌పై దక్షిణాఫ్రికా 438 పరుగులు, దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 434 రన్స్, జింబాబ్వేపై దక్షిణాఫ్రికా 418 పరుగులు, వెస్టిండీస్‌పై భారత్ 418 పరుగులతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ మొదలెట్టింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ రాయ్ (1) పెవిలియన్ చేరాడు. ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు నెదర్లాండ్స్ జట్టుకు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లంతా దూకుడుగానే ఆడారు. సిక్సులు, ఫోర్లు బాదుతూ అరివీర భయంకరంగా బ్యాటింగ్ చేశారు. వన్డే ఫార్మాట్ అనే విషయాన్ని మర్చిపోయి ఈ మ్యాచ్‌లో 26 సిక్సులు, 36 ఫోర్లతో నెదర్లాండ్స్ బౌలర్లను దడదడలాడించారు.
ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (122; 93 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడి తన తొలి వన్డే సెంచరీని సాధించాడు. డేవిడ్ మలన్ (125; 109 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కలిసి సాల్ట్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. తరవాత వచ్చిన జొస్ బట్లర్(162 నాటౌట్; 70 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్సులు) సిక్సర్లతో చెలరేగాడు. ఇయాన్ మోర్గాన్ (0) అవుట్ అయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్ (66 నాటౌట్; 22 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా విరుచుకుపడ్డాడు. దీంతో ఇంగ్లండ్ 498/4 స్కోర్ చేసింది.
Also Read: చేతిలో పిస్తోల్ పట్టుకొని.. భయపడుతూ, భయపెట్టిస్తోన్న జాన్వీ కపూర్!
Also Read: Name Astrology: పేరు ఈ అక్షరంతో మొదలయితే.. భవిష్యత్తులో చాలా ఎత్తుకు ఎదుగుతారు?
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.