Khel Ratna Award: భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న-2021(Khel Ratna Award-2021) అవార్డుకు 11 మంది, అర్జున అవార్డు(Arjuna Awards)కు 35 మంది అథ్లెట్ల పేర్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ బుధవారం నామినేట్‌ చేసింది. ఖేల్‌రత్నా అవార్డుకు టోక్యో ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా(Neeraj Chopra), భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్(Mithali Raj), ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ నామినేట్‌ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రికెటర్‌ శిఖర్‌ ధావన్(Shikhar Dhawan), టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భవీనా పటేల్‌ తదితరులు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. ఏటా జులై-ఆగస్టులో ఈ జాతీయ అవార్డుల ప్రదానం ఉండగా.. టోక్యో ఒలింపిక్స్‌ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కాగా, గ‌తంలో రాజీవ్‌గాంధీ ఖేల్‌ర‌త్నపేరుతో ఉన్న ఖేల్‌రత్న అవార్డును ఇటీవ‌లే మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డుగా మార్చిన సంగతి తెలిసిందే. 


Also read: T20 rankings: టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించిన ICC.. దిగజారిన కోహ్లీ, రాహుల్ ర్యాంకులు!


ఖేల్‌ రత్న అవార్డు 2021 
* నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్)
* రవి దహియా (రెజ్లింగ్)
* పీఆర్‌ శ్రీజేష్ (హాకీ)
* లవ్లీనా బొర్గోహైన్‌ (బాక్సింగ్)
* సునీల్ చెత్రీ (ఫుట్‌బాల్)
* మిథాలీ రాజ్ (క్రికెట్)
* ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్)
* సుమిత్ అంటిల్ (అథ్లెటిక్స్)
* అవని ​​లేఖరా (షూటింగ్)
* కృష్ణ నాగర్ (బ్యాడ్మింటన్)
* మనీష్ నర్వాల్ (షూటింగ్)


అర్జున అవార్డ్‌ 2021
* నిషద్ కుమార్ (హైజంప్)
* ప్రవీణ్ కుమార్ (హైజంప్)
* శరద్ కుమార్ (హైజంప్)
* యోగేష్ కథునియా (డిస్కస్ త్రో)
* సుహాస్ LY (బ్యాడ్మింటన్)
* సింగ్‌రాజ్ అధానా (షూటింగ్)
* భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్)
* హర్విందర్ సింగ్ (ఆర్చరీ)
* శిఖర్ ధావన్ (క్రికెట్)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook