Nepal Cricket team: మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానేని దోషిగా తేల్చింది ఖాట్మండులోని కోర్టు. దీంతో అతడి క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడింది. నేపాల్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో సందీప్.. తనను హోటల్ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు..తాజాగా దోషిగా నిర్దారించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటన ఈ ఏడాది జనవరిలో ఖాట్మండులోని ఒక హోటల్ లో జరిగినట్లు తెలిసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే సందీప్‌ లామిచానే అరెస్ట్ చేశారు. అయితే కోర్టు సందీప్ ను రూ.20 లక్షల పూచికత్తుతో బెయిల్ పై విడుదల చేసింది. అనంతరం దేశం తరుపున అనేక టోర్నమెంట్‌లలో ఆడాడు సందీప్. సందీప్ గతంలో బిగ్ బాష్, ఐపీఎల్‌ వంటి మెగాటోర్నీల్లో ఆడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అతడు దోషిగా తేలడంతో..సందీప్ పై  విదేశీ లీగ్‌లలో ఆడకుండా కోర్టు నిషేధం విధించింది. 


అతడి శిక్షపై కోర్టు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. సందీప్‌కు శిక్షపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం తెలిపింది. జనవరి 10న తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో సందీప్ కు పదేళ్లు జైలుశిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు అతడు తెలిపాడు. నేపాల్ కోర్టు విచార‌ణ పట్ల లాయ‌ర్ స‌బితా భండారి బ‌రాల్ అసంతృప్తి వ్య‌క్తం చేసినట్లు తెలుస్తోంది.


Also Read: IND VS SA 02nd Test Updates: రెండో టెస్టుకు అవేశ్ ఖాన్‌.. ష‌మీ స్థానంలో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter