Shahid Kapoor trolled: `క్రికెటర్‌గా సినిమా తీస్తూ.. క్రికెట్‌పై కనీస అవగాహన లేదా?`
Shahid Kapoor trolled: సోషల్ మీడియాలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌పై ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. క్రికెట్ గురించి కనీస అవగాహన లేదంటూ ఆయనపై నెటిజన్లు పైర్ అవుతున్నారు.
Shahid Kapoor trolled: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పెట్టిన పోస్టే ఇందుకు కారణం. ఆ పోస్ట్ డిలీట్ చేసినా.. అప్పటికే చాలా మంది దానిని స్క్రీన్‌షాట్ తీసుకుని షాహిద్ కపూర్‌పై ట్రోల్స్కోసం వాడుతున్నారు.
ఇంతకీ ఏమైందంటే..
ఫిబ్రవరి 5న జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. కెప్టెన్ యశ్ ధూల్ సారధ్యంలో యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ను చిత్తు చేశారు. దీనితో ఐదో సారి టీమ్ ఇండియా కుర్రాళ్ల టీమ్ వరల్డ్‌కప్‌ను ముద్దాడారు. ఈ సారి టీమ్‌కు యశ్ ధూల్ సారథ్యం వహించాడు.
దీనితో యువ క్రికెటర్లకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు చాలా మంది కుర్రాళ్లను పొగిడారు. బీసీసీఐ.. యువ ఆటగాళ్లు ఒక్కొక్కరికి రూ.40 నజరానా ప్రకటిచింది. సపోర్ట్ స్టాఫ్‌కు రూ.25 లక్షల చొప్పున రివార్డ్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఇక ఈ రికారక్డు విజయంపై ఇన్స్టాగ్రామ్ వేదికగా బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ కూడా మెచ్చుకున్నారు. టీమ్ ఇండియాను పొగుడుతూ ఓ పోస్ట్ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. షాహిద్ తన పోస్ట్‌లో ఓ పొరపాటు చేశారు.
తన పోస్టులో ప్రస్తుత టీమ్‌కు బదులు.. 2018లో కప్పు గెలిచిన టీమ్ ఫొటోను షేర్ చేశారు. అప్పటి అండర్ 19 కెప్టెన్ పృధ్వి షాను ట్యాగ్ కూడా. షాహిద్ షేర్ చేసిన ఈ ఫొటోలో పృధ్వి షాతో పాటు, శుభ్‌మన్‌గిల్, కమలేశ్ నాగర్కోటి, శివమ్ మావి సహా ఇతర ప్లేయర్స్ ఉన్నారు.
అయితే తన పోస్ట్‌కు వచ్చిన కామెంట్స్ చూసిన షాహిద్.. కొద్ది సేపటికి దానిని డిలీట్ చేశారు. అయితే నెటిజన్స్ అప్పటికే ఆ పోస్ట్‌ను స్క్రీన్‌షాట్ తీసుకున్నారు. అంతే కాకుండా.. వెంటనే దానిని సోషల్ మీడియోలో షేర్ చేస్తూ.. షాహిద్‌పై మండిపడుతున్నారు.
త్వరలో విడుదల కానున్న 'జెర్సీ'లో క్రికెటర్‌గా కనిపించనున్న షాహిద్‌కు.. టీమ్ ఇండియాపై కనీస అవగాహన లేదంటూ ట్రోల్స్ చేస్తున్నారు కొందరు.
కొంత మందేమో.. షాహిద్ కపూర్ ఇంకా.. కబీర్ సింగ్ ఫీవర్లోనే ఉన్నాడంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.
Also read: India vs West Indies: తొలి వన్డేలో భారత్ ఘన విజయం- 22 ఓవర్లు మిగిలి ఉండగానే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter