IND Vs NZ: శుభ్‌మన్ గిల్ Vs పృథ్వీ షా.. హార్ధిక్ పాండ్యాను ఆడుకుంటున్న నెటిజన్లు
Shubman Gill Vs Prithvi Shaw: న్యూజిలాండ్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బ్యాట్స్‌మెన్ వైఫల్యమే మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణం కాగా.. హార్ధిక్ పాండ్యాపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న పృథ్వీ షాను ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించకపోవడంపై ట్రోల్ చేస్తున్నారు.
Shubman Gill Vs Prithvi Shaw: వన్డేల్లో కివీస్‌ను చిత్తు చేసిన భారత్.. టీ20 సిరీస్‌లోనూ అదే దూకుడు కంటిన్యూ చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే తొలి టీ20 మ్యాచ్‌లో అనూహ్యంగా టీమిండియాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌లో పోరాటే స్కోరు చేసిన ప్రత్యర్థి జట్టు.. ఆ తరువాత బౌలింగ్‌లోనూ క్రమం తప్పకుండా వికెట్లు తీసి మ్యాచ్‌ను ఎగరేసుకుపోయింది. భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడంతో 21 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్ధిక్ పాండ్యా నెట్టింట భారీ ట్రోలింగ్ జరుగుతోంది.
దేశవాళీ మ్యాచ్‌ల్లో అదరగొట్టి చాలా కాలం తరువాత టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్న పృథ్వీ షాకు ప్లేయింగ్ 11లో ప్లేస్ ఇవ్వకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ సెట్ అవ్వడంతో పృథ్వీకు అవ్వకాశం ఇవ్వలేదని పాండ్యా చెప్పగా.. ఈ జోడి ఫెయిల్ అవ్వడమే భారత్ ఓటమికి ప్రధాన కారణమని నెటిజన్లు అంటున్నారు. శుభ్‌మన్ గిల్ గణాంకాలతో పోల్చి పోస్టులు పెడుతున్నారు.
ఎలాంటి బౌలింగ్ అటాక్‌నైనా చిత్తు చేయగల సత్తా పృథ్వీ షాకు ఉందని.. ఇన్నింగ్స్ ప్రారంభంలో ప్రత్యర్థి బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తాడని అంటున్నారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో పృథ్వీ షాకు చోటు దక్కకపోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున పృథ్వీ షా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాడు. తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.
రంజీ ట్రోఫీలో అస్సాంపై 383 బంతుల్లో 379 పరుగులు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. దీంతో చాలా కాలం తర్వాత పృథ్వీ షాకు టీమిండియాలో చోటు దక్కింది. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం ఇవ్వలేదు. భారత్ తరఫున 5 టెస్టు మ్యాచ్‌ల్లో 339 పరుగులు, 6 వన్డేల్లో 189 పరుగులు చేశాడు ఈ యంగ్ బ్యాట్స్‌మెన్. 63 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1588 రన్స్ చేశాడు.
రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 155 రన్స్‌కే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్‌మెన్ ముకుమ్మడిగా విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ (25 బంతుల్లో 50) మెరుపులు మెరిపించగా.. సూర్యకుమార్ యాదవ్ (47) రాణించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది న్యూజిలాండ్.
Also Read: Shocking: లేటు వయసులో ఘాటు ప్రేమ... కోడలిని పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల మామ..!
Also Read: Ind Vs NZ: తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ.. వాషింగ్టన్ సుందర్ మెరుపులు వృథా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook