వరుస విజయాలతో దూసుకెళ్తోన్న న్యూజిలాండ్
టీ20లో ఘోర ఓటమిని చవిచూసిన న్యూజిలాండ్, వన్డే క్రికెట్లో తన సత్తాను చాటుతుంది. ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియాపై కివీస్ విజయం సాధించింది.
ఆక్లాండ్: టీ20లో ఘోర ఓటమిని చవిచూసిన న్యూజిలాండ్, వన్డే క్రికెట్లో తన సత్తాను చాటుతుంది. ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియాపై కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.3 ఓవర్లలో 251 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
దీంతో ఇండియాపై 22 పరుగుల తేడాతో కివీస్ గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్ ను కివీస్ 2-0తో కైవసం చేసుకుంది. భారత్ బ్యాట్స్ మెన్స్ లో శ్రేయస్ అయ్యర్(52), రవీంద్ర జడేజా(55), నవదీప్ సైనీ(45)లు మాత్రమే రాణించగా.. ఓపెనర్లతోపాటు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ విరాట్ కోహ్లీ(15), కెఎల్ రాహుల్(4)లు ఘోరంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, జమీషన్, గ్రాండ్ హోమ్, బెన్నెత్ లు తలో వికెట్ పడగొట్టగా, నీషమ్ ఒక వికెట్ తీశాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..