వెల్లింగ్టన్: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టుతో న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు రాస్ టేలర్ సరికొత్త చరిత్ర లిఖించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ క్రికెటర్‌కు సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెల్లింగ్టన్‌తో జరగుతున్న తొలి టెస్ట్ రాస్ టేలర్‌కు 100వ మ్యాచ్. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ టెస్టులు, వన్డేలు, ట్వంటీ20లు అన్ని ఫార్మాట్లలో కనీసం 100 లేక అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. టెస్ట్ సిరీస్‌లో భాగంగా శుక్ర‌వారం ప్రారంభ‌మైన తొలి టెస్టులో త‌న ఫ్యామిలీతో క‌లిసి మైదానంలోకి అడుగుపెట్టాడు రాస్ టేలర్. అరుదైన గౌరవాన్ని స్వీకరించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: 30ఏళ్ల తర్వాత మయాంక్ అగర్వాల్ సాధించాడు


కాగా, ఈ ఫిబ్రవరి నెల‌లోనే భార‌త్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో ఈ ఫార్మాట్‌లో వంద మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. 2006లో కివీస్ జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన 35 ఏళ్ల టేల‌ర్‌.. 14 ఏళ్ల కెరీర్‌లో టేల‌ర్ 100 టెస్టులు, 231 వ‌న్డేలు, 100 టీ20లు ఆడాడు. కివీస్ తరఫున టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా టేలరే కావడం విశేషం. న్యూజిలాండ్ తరఫున అత్యధికంగా 40 సెంచరీలు సాధించాడు. 2023 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడాలనుందని చెబుతున్నాడు.


Also Read: ఐపీఎల్ 2020 షెడ్యూల్.. తొలి, చివరి మ్యాచ్ వారిదే! 


100 టెస్టుల్లో 175 ఇన్నింగ్స్‌లు ఆడిన టేలర్.. 19 శతకాలు, 33 అర్ధశతకాలు బాది 7,174 పరుగులు సాధించాడు. 231 వ‌న్డేలు ఆడిన టేలర్.. 215 ఇన్నింగ్స్‌లో 21 శతకాలు, 51 అర్ధశతకాల సాయంతో 8,570 పరుగులు చేశాడు. 100 ట్వంటీ20ల్లో 92 ఇన్నింగ్స్‌ల్లో 7 హాఫ్ సెంచరీలు బాదిన టేలర్ 1909 పరుగులు సాధించాడు.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..