Devon Conway : టెస్టుల్లో `కాన్వే` ప్రపంచ రికార్డు... తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత!
Devon Conway : తొలి ఐదు టెస్టుల్లోని మొదటి ఇన్నింగ్స్ అన్నింటిలోనూ హాఫ్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా కివీస్ ఆటగాడు డేవిడ్ కాన్వే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
NZ vs BAN, 2nd Test: న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే (Devon Conway) అరుదైన ఘనత సాధించాడు. ఆడిన మొదటి ఐదు టెస్టుల్లోని మొదటి ఇన్నింగ్స్ అన్నింటిలోనూ 50 ప్లస్ స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా కాన్వే ప్రపంచ రికార్ఢు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (NZ vs BAN 2nd Test) ఆర్దసెంచరీ సాధించటం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. కాన్వే ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడగా, మొత్తం 5 టెస్టుల్లో 50కు పైగా పరుగులు సాధించాడు. దీంట్లో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
గతేడాది జూన్‌లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో (England) జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు కాన్వే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత డబుల్ సెంచరీ (200) చేసి...సంచలనం సృష్టించాడు. తర్వాత ఎడ్జ్‌బాస్టన్ టెస్టులోనూ 80 పరుగులతో ఆకట్టుకున్నాడు. అదే విధంగా టెస్టు ఛాంఫియన్‌షిప్ ఫైనల్లోనూ భారత్‌పై 54 పరుగులతో కాన్వే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ (122)తో మెరిశాడు. ఆదివారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆటముగిసే సమయానికి 99 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
అదరగొట్టిన లాథమ్, కాన్వే
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో (NZ vs BAN, 2nd Test) టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు విల్ యంగ్, టామ్ లాథమ్ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 148 పరుగులు జోడించారు. 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద యంగ్ ఔటయ్యాడు. అనంతరం కాన్వే క్రీజులోకి వచ్చాడు. బంగ్లా బౌలర్లపై విరుచుపడుతూ వీరిద్దరూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ వికెట్ నష్టానికి 349 పరుగులు చేసింది. లాథమ్ (186*), కాన్వే (99*) క్రీజులో ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి