లార్డ్స్ మైదానం వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ టై అవడంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సూపర్ ఓవర్ నిర్వహించేందుకు సిద్ధమైంది. సూపర్ ఓవర్ అనంతరం మ్యాచ్ ఎవరు గెలుస్తారో.. వారినే ఐసిసి ఈ పోటీల్లో విశ్వవిజేతగా ప్రకటించనుంది. సూపర్ ఓవర్‌లో ఇంగ్లండ్ తరపున బ్యాటింగ్ చేసేందుకు ఇంగ్లండ్‌ను మొదట గట్టెక్కించిన జాస్ బట్లర్, బెన్ స్టోక్స్ మళ్లీ పిచ్‌లోకి అడుగుపెట్టారు. 2 వికెట్స్ పడే వరకే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఒకవేళ ఈ సూపర్ ఓవర్‌లోనూ మళ్లీ మ్యాచ్ టై అయినట్టయితే, సుపీరియర్ బౌండరీ కౌంట్ ప్రకారం ఇంగ్లండ్ జట్టునే విజేతగా ప్రకటిస్తారు.