PAK vs WI, Pakistan Captain Babar Azam Breaks Virat Kohli ODI Record: వన్డే క్రికెట్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజ‌మ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ముల్తాన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచులో సెంచరీ (103) చేసిన బాబర్‌.. ఈ ఘనత అందుకున్నాడు. గ‌తంలో ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ 17 వన్డే ఇన్నింగ్స్‌ల్లో కెప్టెన్‌గా వెయ్యి పరుగులు పూర్తిచేసి ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్నాడు. బాబర్‌ ఆజ‌మ్ 13 ఇన్నింగ్సుల్లోనే వెయ్యి పరుగులు బాది కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ 18 ఇన్నింగ్స్‌ల్లో 1000 రన్స్ చేసి మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజీలాండ్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ 20 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత అందుకోగా.. ఇంగ్లండ్ మాజీ సారథి అలిస్టర్‌ కుక్‌ 21 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి తర్వాతి స్థానాల్లో నిలిచారు.


వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచులో సెంచరీ చేయడంతో బాబర్‌ ఆజ‌మ్ వన్డేల్లో రెండోసారి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సెంచరీలు బాదిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. 2016లో వెస్టిండీస్‌ జట్టునే యూఏఈలో 120, 123, 117 పరుగులు బాదాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాపై 114, 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తాజాగా విండీస్‌పై మరో సెంచరీ చేశాడు. వన్డేల్లో రెండోసారి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సెంచరీలు ఆటగాడిగా బాబర్‌ నిలిచాడు. 


బాబర్‌ ఆజ‌మ్ 86 వన్డేల్లో 17 సెంచరీలు సాధించగా.. విరాట్ కోహ్లీ 260 వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు. కోహ్లీ వన్డే సగటు 58.07 కాగా.. బాబర్ సగటు 59.78. గత కొంత కాలంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, అభిమానులు కోహ్లీతో బాబర్‌ను పోల్చుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాబర్ సెంచరీ చేసిన అనంతరం కోహ్లీతో పోల్చుతున్నారు. కోహ్లీ కంటే బాబర్ ఉత్తమమని వారు అంటున్నారు. 


Also Read: Gayatri Jayanti 2022 Mantra: ఆర్థిక కష్టాలు తీరాలంటే.. జూన్ 11న ఈ 24 అక్షరాలు జపిస్తే చాలు!  


Also Read: Balakrishna Birthday: బాల‌కృష్ణ అభిమానుల‌కు డ‌బుల్ బొనాంజా.. 'ఎన్‌బీకే 107' టైటిల్, టీజర్‌కి టైమ్ ఫిక్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook