Pakistan: వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) సోమవారం ప్రకటించింది. బాబర్‌ అజమ్‌(Babur Azam) కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌, ఇద్దరు వికెట్‌ కీపర్స్‌, నలుగురు ఆల్‌రౌండర్స్‌, నలుగురు ఫాస్ట్‌ బౌలర్స్‌ ఉన్నారు. అయితే ఫఖర్‌ జమన్‌, ఉస్మాన్‌ ఖాదీర్, షాహనవాజ్‌ దహానిలను రిజర్వ్‌ ఆటగాళ్లుగా ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందరు అనుకున్నట్టుగానే యువ ఆటగాడు అజమ్‌ ఖాన్‌(Azam Khan) తుది జట్టులో చోటు దక్కించుకోగా.. ఆసిఫ్‌ అలీ, కుష్‌దిల్‌ షా లాంటి కొత్త కుర్రాళ్లు జట్టులోకి వచ్చారు. అయితే పాక్‌ సీనియర్‌ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌(Shoaib Malik), మరో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌(Sarfaraz Ahmed)లకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇక ఆల్‌రౌండర్‌ షార్జీల్‌ ఖాన్‌కు కూడా ప్రాబబుల్స్‌లో చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్‌(T20 World Cup) లో పాకిస్తాన్‌, భారత్‌ ఒకే గ్రూపులో ఉన్న సంగతి తెలిసిందే. గ్రూపు 2లో భాగంగా భారత్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, అఫ్గానిస్తాన్‌, బి1 క్వాలిఫయర్‌, ఏ2 క్వాలిఫయర్‌ జట్లు ఉన్నాయి. కాగా పాకిస్తాన్‌ టీమిండియా(India)తో అక్టోబర్‌ 24న దుబాయ్ లో తొలి మ్యాచ్‌ ఆడనుంది. 


Also Read:Ind Vs Eng : టీమిండియాకు షాక్..హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్..మరో ముగ్గురు సభ్యులు కూడా..!


పాక్‌ టీ20 జట్టు:
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్‌ కెప్టెన్‌), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook