Wahab Riaz Announces Retirement: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించాడు. 15 ఏళ్ల పాటు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వహాబ్.. క్రికెట్‌కు వీడ్కోలు పలికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2020లో చివరి మ్యాచ్ ఆడగా.. ఈ ఏడాది జనవరిలో పొలిటిషియన్‌గా మారిపోయాడు. గత రెండేళ్లు రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నానని 38 ఏళ్ల వహాబ్ తన ప్రకటనలో తెలిపాడు . పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడడం తనకు గర్వకారణంగా ఉందన్నాడు. దేశానికి తన శక్తిమేర సేవ చేశానని.. గతంలో కంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి వైదొలిగినా.. తాను ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడతానని వెల్లడించాడు. ఈ టోర్నీలో ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభావంతులతో ఆడే అవకాశం లభిస్తుందన్నాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్థాన్ తరపున 27 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రియాజ్.. 34.50 సగటుతో 83 వికెట్లు తీశాడు. 91 వన్డేల్లో 34.30 సగటుతో 120 వికెట్లు, 36 టీ20 మ్యాచ్‌ల్లో 28.55 సగటుతో 34 వికెట్లు తీశాడు. ఇటీవల పీసీఎల్ 2023లో పెషావర్ జల్మీ జట్టు తరుఫున ఆడాడు. 2020లో పాక్ తరఫున ఆడిన ఈ లెఫ్టార్మ్ స్పీడ్‌ స్టార్ తరువాత మళ్లీ జాతీయ జట్టులో చోటు లభించలేదు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటునే.. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడనున్నాడు. రీసెంట్‌గా పంజాబ్ ప్రావిన్స్ క్రీడా మంత్రిగా కూడా నియమతులయ్యాడు వహాబ్ రియాజ్.  తన వీడ్కోలు విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.


వన్డేల్లో వహాబ్ రియాజ్ అత్యుత్తమ ప్రదర్శన టీమిండియాపైనే చేశాడు. 2011 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 46 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ వంటి స్టార్ల వికెట్లు తీశారు.  ఆ వరల్డ్‌కప్‌లో అత్యుత్తమంగా బ్యాటింగ్ చేసిన యువీని తొలి బంతికే వహాబ్ బౌల్డ్ చేయడం విశేషం. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. తరువాత ఫైనల్లో శ్రీలంకను ఓడించి రెండోసారి 27 ఏళ్ల తరువాత ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 


Also Read: Minister KTR: 70 వేల ఇళ్లు పంపిణీకి సిద్ధం.. వచ్చే వారంలోనే తొలి దశ పంపిణీ: మంత్రి కేటీఆర్  


Also Read: Warangal Road Accident: రాంగ్‌ రూట్‌లో దూసుకొచ్చి ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook