Babar Azam New Record: పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ ఆజాం తన జోరును కొనసాగిస్తున్నాడు. ఈఏడాది మంచి ఫామ్‌లో ఉన్న అతడు ..వరుసగా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. తాజాగా బాబర్ ఆజాం ఖాతాలో మరో రికార్డు చేరింది. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 77 పరుగులు చేశాడు.  పాక్‌ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వన్డేలు, టీ20లు, టెస్ట్‌ల్లో కలిపి వరుసగా తొమ్మిది సార్లు 50కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లో 57, 144, 105 పరుగులు చేశాడు. విండీస్‌తో జరిగిన రెండు వన్డేల్లో 103, 77 పరుగులు సాధించాడు. ఏప్రిల్ 5న ఆసీస్‌తో జరిగిన టీ20లో 66 పరుగులు చేశాడు. ఇక టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో 196, 67,55 పరుగులు నెలకొల్పాడు.


విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్‌ 120 పరుగుల తేడాతో విజయం ఢంకా మోగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే పాకిస్థాన్‌ వశం అయ్యింది. పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేయగా..విండీస్‌ 155 పరుగులకు ఆలౌట్ అయ్యింది.


Also read: Joe Biden on Zelenskyy: ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా సైనిక చర్య..యుద్ధంపై బైడెన్ ఏమన్నారంటే..!


Also read:Mamata letter to oppositions: మనమంతా ఏకమవుదాం..విపక్ష నేతలకు మమతా బెనర్జీ పిలుపు..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి