India Vs Pakistan Match: ఐసీసీ టీ20 వరల్డ్​ కప్​లో (ICC T20 World Cup 2021) ఇండియా, పాకిస్తాన్​ మ్యాచ్​కు (India Vs Pakistan Match) మరో రెండు రోజులే మిగిలుంది. దీంతో ఈ మ్యాచ్​పై ఇరు దేశాల క్రికెట్​ అభిమానులకే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్​ ఫ్యాన్స్​లో ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్​లో విజయం తమదే అంటూ ఇరు జట్లు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో జరిగిన వరల్డ్​ కప్​లను పరిశీలిస్తే పాకిస్తాన్​ టీమ్​పై ఇండియా జట్టే ఆధిపత్యం చలాయించింది. అయితే అది గతం అని అంటున్నాడు పాక్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​. గతాన్ని తాము మార్చబోతున్నామంటూ చెబుతున్న బాబర్​ అజామ్​ (Babar Azam Vs India).. ఈ మ్యాచ్​లో టీమ్ఇండియాపై తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"టీ20 ప్రపంచకప్​లో భారత్​తో జరగనున్న మ్యాచ్​ను మేము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం. మా ఇరు జట్ల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. టీ20 ప్రపంచకప్​ చరిత్రలో ఇప్పటి వరకు మా జట్టు టీమ్ఇండియాను ఓడించలేదు. కానీ, అది గతం. ఇప్పుడు మేము దాన్ని తిరగరాయబోతున్నాం. అక్టోబరు 24న (ఆదివారం) జరగనున్న మ్యాచ్​లో విజయం మాదే. ఒత్తిడిలోనూ ఎలా ఆడాలి అనే దానిపై ప్రణాళికలను రచించాం. ఈ మ్యాచ్​లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు మైదానంలో నియంత్రణ కోల్పోరని ఆశిస్తున్నా. టీమ్ఇండియాపై విజయం సాధించేందుకు స్పిన్నర్లతో బరిలో దిగనున్నాం. ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తాం"  అని పాకిస్తాన్​ టీమ్ కెప్టెన్​ బాబర్​ అజామ్​ అన్నాడు. 


చివరగా భారత్- పాకిస్తాన్ జట్లు న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్‌ కప్‌లో (ICC ODI World Cup 2019) భాగంగా 2019 జూన్‌ 16న తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 89 రన్స్‌ తేడాతో పాకిస్తాన్ (India Vs Pakistan) జట్టుపై గెలిచింది. దాదాపు రెండేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగకపోవటం.. ఈ సారి తలపడటం... అది కూడా పొట్టి ప్రపంచకప్ (T20 World Cup)లో దాయాది దేశాల మధ్య సమరం జరగటం.. క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పాలి. 


T20 వరల్డ్ కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 24 అంటే ఆదివారం రోజున జరగనుంది. ఇరు జట్ల మధ్య జరగనున్న హై ఓట్లేజ్ మ్యాచ్ (High Voltage Match) కు క్రీడా అభిమానులు "క్రికెట్ సూపర్ సండే" (Cricket Super Sunday) అని పేరు కూడా పెట్టుకున్నారు.    


హిస్టరీ పరంగా చూస్తే.. ఇప్పటి వరకు ఇండియా - పాకిస్తాన్ జట్లు (India Vs Pakistan Winning Record) ఏడూ సార్లు ప్రపంచక‌ప్‌లో తలపడ్డాయి. వీటిలో 5 మ్యాచ్‌లు టీ20 వరల్డ్ కప్​లు కాగా.. నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా.. ఒక మ్యాచ్ రద్దు అయింది. ప్రపంచక‌ప్‌లో ఏడూ సార్లు తడబడిన అన్ని మ్యాచుల్లో భారత్‌దే పై చేయిగా నిలిచింది.. ఈ సారి ఎలా అయిన హిస్టరీని తిరగ రాయలని పాకిస్తాన్ జట్టు వ్యూహాలు రచిస్తుంటే.. భారత్ మాత్రం ఈ సారి కూడా ఆధిపత్యం మాదే అంటూ దీమాగా ఉంది. 


Also Read: India Vs Pakistan Match 2021: 'కేఎల్​ రాహుల్​ బ్యాటింగ్​తో పాకిస్తాన్​ టీమ్​కు ప్రమాదం'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook