రాంచి వేదికగా ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన 3వ వన్డేలో టీమిండియా ఆటగాళ్లు ఇండియన్ ఆర్మీ టోపీలు ధరించి ఆటను రాజకీయం చేసినందుకుగాను వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)ని కోరారు. క్రికెట్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు ఇండియన్ ఆర్మీ టోపీలు ధరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన పాకిస్తాన్.. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు)కి సూచించింది. టీమిండియా ఇండియన్ ఆర్మీ టోపీలు ధరించడం ఆపకపోతే, ఇకపై తాము కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ అక్రమాలను నిరసిస్తూ నల్ల బ్యాండులను ధరించాల్సి ఉంటుందని పాక్ హెచ్చరించింది.


పుల్వామా దాడిలో అమరులైన వారికి నివాళిగా ఇకపై ప్రతీ ఏడాది ఏదో ఒక మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఇలాగే ఇండియన్ ఆర్మీ టోపీలను ధరించనున్నట్టు బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే.