Pat Cummins named as Australia ODI Captain after Aaron Finch retirement: టీ20 ప్రపంచకప్‌ 2022కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా వన్డే ఫార్మట్ కెప్టెన్సీ పగ్గాలను ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్‌కి అప్పజెప్పింది. ఆరోన్ ఫించ్ వన్డే ఫార్మట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందనే అనిశ్చితకు తెరపడింది. దాంతో క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్సీ ఆశించిన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు షాక్ తగిలింది. ఇక వైస్ కెప్టెన్‌గా ఎవరినీ ఎంపిక చేయలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాట్ కమ్మిన్స్‌ ఇప్పటికే టెస్ట్ ఫార్మట్‌కు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. టెస్టుల్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించడంతో.. వన్డే ఫార్మట్ కెప్టెన్సీ పగ్గాలను కూడా అతడికే అప్పగిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా ఓ ఫాస్ట్ బౌలర్‌ను నియమించడం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. మొత్తంగా ఆస్ట్రేలియాకు 27వ సారథిగా కమ్మిన్స్ నియమితుడయ్యాడు. త్వరలోనే కమ్మిన్స్ బాధ్యతలను తీసుకోనున్నాడు. 



2021 మార్చిలో పాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 1957లో ఫాస్ట్ బౌలర్ రే లిండ్‌వాల్ ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించాడు. అనంతరం బౌలర్ల చేతికి ఆసీస్ కెప్టెన్సీ పగ్గాలు వెళ్లలేదు. ఆ రికార్డును పాట్ కమ్మిన్స్ బ్రేక్ చేశాడు. లిండ్‌వాల్  కెప్టెన్సీలో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌ను గెలుచుకుంది. టెస్ట్, వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్‌లో తిరుగులేని మేటి బౌలర్‌గా కమ్మిన్స్ పేరు తెచ్చుకున్నాడు. 43 టెస్టులు, 68 వన్డేలు, 42 టీ20లు కమ్మిన్స్ ఆసీస్ తరఫున ఆడాడు. 


Also Read: T20 World Cup 2022: టీమిండియాకు మళ్లీ షాక్... మరో స్టార్ ప్లేయర్​కు గాయం..


Also Read: Chinmayi Sripada Twin Babies : పిల్లలకి పాలిస్తున్న చిన్మయి.. వైరల్ పిక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook