PBKS vs SRH Highlights: ఉత్కంఠ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం.. పంజాబ్ ఓటమి
PBKS vs SRH IPL 2024 Highlights SRH Beat PBKS: ఈ సీజన్‌లో అత్యంత ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్‌పై హైదరాబాద్ పైచేయి సాధించింది. చెన్నైపై సత్తా చాటిన సన్‌రైజర్స్ పీబీకేఎస్‌పై కూడా విజయం సాధించింది.
SRH Beat PBKS: ఈ సీజన్‌లో అత్యంత ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్‌పై హైదరాబాద్ పైచేయి సాధించింది. చెన్నైపై సత్తా చాటిన సన్‌రైజర్స్ పీబీకేఎస్‌పై కూడా విజయం సాధించింది. అతితక్కువ స్కోర్ అయినా కూడా మ్యాచ్ రసవత్తరంగా సాగింది.
Also Read: CSK vs KKR Highlights: కోల్‌కత్తా దూకుడుకు చెన్నై బ్రేక్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గట్టెక్కిన సీఎస్కే
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక పరుగులు సాధించడంలో తడబడింది. నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్లు తక్కువ స్కోర్‌కే పరిమితమైన వేళ మిడిలార్డర్‌లో వచ్చిన నితీశ్‌కుమార్ రెడ్డి మాత్రమే సత్తా చాటాడు. ట్రావిస్ హెడ్ (21), అభిషేక్ శర్మ (16) సాధారణ స్కోర్ చేయగా.. అయిడెన్ మార్కక్రమ్ మాత్రం డకౌటై నిరాశపర్చాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి చెలరేగి ఆడాడు. 37 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు.
Also Read: GT vs PBKS Highlights: శుభ్‌మన్ గిల్ కుమ్మినా గుజరాత్‌కు తప్పని ఓటమి.. శశాంక్ మాయతో పంజాబ్ విజయం
నితీశ్ తర్వాత అబ్దుల్ సమద్ (25) బ్యాట్‌తో రెచ్చిపోయాడు. రాహుల్ త్రిపాఠి (11), క్లాసెన్ (9), షాబాద్ అహ్మద్ (14) పర్వాలేదనిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ రఫ్ఫాడించారు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌తో హైదరాబాద్‌ను బెంబేలెత్తించాడు. 29 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. సామ్ కరాన్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్ల చొప్పున, రబాడ ఒక వికెట్ తీశాడు.
మోస్తారు లక్ష్యాన్ని ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసి ఓటమి అంచున నిలిచింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (14) ఫెయిలవడంతో జోన్ బెయిర్‌స్టో డకౌటయ్యాడు. ప్రభ్ సిమ్రన్ సింగ్ (4) తక్కువ స్కోర్‌కే ఔటవగా.. మిడిలార్డర్ సత్తా చాటింది. సామ్ కరాన్ (29), సికిందర్ రజా (28) బ్యాట్‌తో జట్టు విజయం కోసం శ్రమించారు. మరోసారి శశాంక్ సింగ్ 46 పరుగులతో విజృంభించాడు. జితేష్ శర్మ (19), అశుతోష్ (౩౩) రాణించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు సత్తా చాటారు. బౌలర్లు పరుగులు రాబట్టకుండా నియంత్రించారు. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్, నటరాజన్, నితీశ్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనద్కట్ చెరొక వికెట్ కోల్పోయారు. చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్ బోల్తా పడింది. చెన్నైపై విజృంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్‌పై కూడా సత్తా చాటింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి