పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రమీజ్ రాజా ఒక ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. ఆ దేశ అండర్ 19 క్రికెట్ జట్టుకు రాహుల్ ద్రావిడ్ లాంటి మేటి కోచ్ ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలో న్యూజిలాండ్‌లో అండర్ 19 వరల్డ్ కప్ జరగబోతున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మంచి అనుభవం ఉన్న మాజీ టెస్ట్ ప్లేయర్‌ని, కొత్త కుర్రాళ్లకు కోచింగ్ ఇవ్వడానికి రిక్రూట్ చేసుకోవాలని... భారత్ కూడా ద్రావిడ్ లాంటి కోచ్‌ను తీసుకొని మంచి పని చేసిందని ఆయన అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"యువ ఆటగాళ్లతో పాటు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడానికి సిద్ధమవుతున్న కుర్రాళ్లకు పూర్తిస్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నించాలే గానీ.. ప్రస్తుత గెలుపోటముల గురించి ఆలోచించకూడదు. మంచి కోచ్‌ను నియమిస్తే.. కుర్రాళ్లు బాగా తర్ఫీదు పొంది... భవిష్యత్తులో మంచి విజయాలను నమోదు చేస్తారు" అని రమీజ్ రాజా తెలిపారు.