టీమిండియా కెప్టెన్ విరాట్ విసిరిన ఛాలెంజ్ కు ప్రధాని మోడీ సై అన్నారు. ఇదేం ఛాలెంజ్ అనుకుంటున్నారా ? అదేనండి ఇటీవలే విరాట్ ప్రధాని మోడీకి విసిరిన ఫిట్ నెస్ ఛాలెంజ్. కాగా ఆ  సవాల్ ను స్వీకరించేందుకు సిద్ధమని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికపై ప్రకటించారు. అంతే కాదు  ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టారు మోడీ గారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్ళినట్లయితే... విరాట్ తన ఫిటెనెస్ కు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసి కోహ్లి.. మీ ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని తన భార్య అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ ధోనీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి ట్యాగ్ చేస్తూ సవాల్ విసిరాడు. 



 


ఈ సవాల్ ను స్వీకరించిన మోడీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు..  ఇక తన ముందున్న సవాల్ కు సిద్ధమేనని.. పూర్తి స్థాయి ఫిటెనెస్ ను సాధించి ఆ వీడియోను షేర్ చేస్తానని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మాటల్లో చెప్పాలంటే...'' విరాట్.. నువ్వు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నా. త్వరలోనే నా ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియోను షేర్ చేస్తానంటూ కోహ్లి ట్వీట్‌కు బదులిచ్చారు. 



 


అసలు ఈ ఫిటె నెస్ ఛాలెంజ్ క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ నుంచి ప్రారంభమైంది. ఖేల్ ఇండియా పథకాన్ని పురస్కరించుకొని క్రీడా మంత్రి ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరారు. మనం ఫిట్‌గా ఉంటే ఇండియా ఫిట్‌గా ఉంటుందనే హ్యాష్‌ట్యాగ్‌తో తను ఎక్సర్‌సైజ్ చేసిన వీడియోను పోస్ట్ చేసిన రాథోడ్..బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్‌లతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికు ఛాలెంజ్ విసిరారు. రాథోడ్ ఛాలెంజ్ ను  స్వీకరించిన కోహ్లి.. ప్రధానిమోడీని ట్యాగ్ చేస్తూ తన ఫిట్‌నెస్ ఫ్రూవ్ చేసుకున్నాడు.