Prithvi Shaw Journey: అరుదుగా వచ్చిన ఆ అవకాశాన్ని చేజార్చుకున్నా.. ఇప్పటికీ చాలా బాధపడుతున్నా: పృథ్వీ షా
Prithvi Shaw recalled his journey over the last 18 months. క్వాడ్రాపుల్ సెంచరీ చేసే సువర్ణవకాశాన్ని చేజార్చుకున్నందుకు తాను ఇప్పటికీ బాధపడుతున్నానని టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా తెలిపాడు.
Prithvi Shaw said Still I feels really disappointing not to score 400 in Ranji Trophy: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా.. రంజీ ట్రోఫీ 2023లో ట్రిపుల్ సెంచరీతో సత్తాచాటిన విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీ 2023లో ముంబై తరఫున బరిలోకి దిగిన షా.. అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 379 రన్స్ చేశాడు. క్వాడ్రాపుల్ సెంచరీ చేసే సువర్ణవకాశాన్ని కేవలం 21 పరుగుల తేడాతో కోల్పోయాడు. అరెరే.. షా 21 రన్స్ చేస్తే అరుదైన రికార్డు ఖాతాలో వేసుకునేవాడు అని సగటు క్రికెట్ అభిమాని అనుకున్నాడు. కొందరు చాలా నిరాశ చెందారు కూడా. ఇదే విషయంపై తాజాగా పృథ్వీ షా స్పందిస్తూ.. ఆ అవకాశాన్ని చేజార్చుకున్నందుకు తాను ఇప్పటికీ బాధపడుతున్నానని తెలిపాడు.
2021లో శ్రీలంక టూర్‌లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో పృథ్వీ షా చివరిసారి టీమిండియాకు ఆడాడు. ట్రిపుల్ సెంచరీ బాదడంతో 18 నెలల తర్వాత టీమిండియాకు అతడు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. అయితే శుభ్‌మాన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో షాకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్య్వులో షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గడిచిన 18 నెలలు తనకు కష్టకాలంగా అనిపించిందని, అయితే మళ్లీ భారత జట్టులోకి రావడం సంతోషం కలిగించిందని చెప్పాడు.
'చాలా నెలలుగా నేను టీమిండియాకు దూరంగా ఉన్నాను. పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది. రాత్రి 10.30 సమయంలో బీసీసీఐ సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. ఆ సమయంలో నాకు చాలా ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయి. ఫోన్ హ్యాంగ్ అవడంతో ఏం జరిగిందని షాక్ అయ్యా. విషయం తెలిసి సంతోషించా. 18 నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న సమయం చాలా కఠినంగా గడిచింది. నాకు మద్దుతు ఇచ్చే వారు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. నా కుటుంబం, స్నేహితులు, కోచ్‌లు చాలా సపోర్ట్‌గా నిలిచారు. అలాంటి వారు నా జీవితంలో ఉండటం అదృష్టం' అని పృథ్వీ షా చెప్పాడు.
'ఎంపికయిన తర్వాత నేను ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. ఆ సమయంలో నేను అస్సాంలో ఉండడంతో.. మా నాన్న కాల్ చేసి జట్టులోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చావ్ అని సంతోషించాడు. ఇక ఫోకస్ ఆట మీద పెట్టమని చెప్పాడు. అవకాశం వస్తే రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని సూచించాడు. ఇక ట్రిపుల్ సెంచరీతో రంజీల్లో రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉంది. అయితే 400 రన్స్ మార్క్ చేరుకోకపోవడంతో ఇప్పటికీ బాధపడుతున్నా. మరో 21 పరుగులు చేస్తే బాగుండు' అని పృథ్వీ షా పేర్కొన్నాడు.
Also Read: Ford Bronco Bookings: ఈ కార్ బుకింగ్‌ను రద్దు చేసుకుంటే.. రూ. 2 లక్షలు మీ సొంతం! లిమిటెడ్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.