Pro kabaddi league season 8 final: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఎనిమిదో సీజన్​ విజేతగా (pro kabaddi league season 8) దబాంగ్ దిల్లీ నిలిచింది. పట్నా పైరేట్స్‌, దబాంగ్ దిల్లీ జట్ల మధ్య జరిగిన ఫైనల్లో పోరులో దిల్లీ తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో 37-36 తేడాతో దిల్లీ జట్టు విజయఢంకా మోగించింది. దీంతో మూడు సార్లు టైటిల్‌ విజేత పట్నా పైరేట్స్ (Patna Pirates) ఒక పాయింట్ తేడాతో పరాజయం పాలైంది. గత సీజన్ ఫైనల్‌లో దిల్లీని బెంగాల్ వారియర్స్ ఓడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఫైనల్ మ్యాచ్‌లో మొదట పట్నా టీమ్ ఆధిపత్యం చెలాయించింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 15-17తో దిల్లీ వెనుకబడి ఉంది. నెమ్మదిగా పుంజుకున్న దబాంగ్ దిల్లీ (Dabang Delhi)..పట్నాకు ఊహించని షాకిచ్చింది. చివరకు 37-36తో టైటిల్‌ని ఎగరేసుకుపోయింది. ఫైనల్లో విజయ్, నవీన్ లిద్దరూ సూపర్ 10లను సాధించడం విశేషం.




దిల్లీ జట్టులో ఆల్‌రౌండర్ విజయ్‌ 14,  స్టార్ రైడర్  నవీన్‌ కుమార్‌ (naveen kumar) 13 పాయింట్లు సాధించగా.. డిఫెన్స్ లో సందీప్‌ నర్వాల్‌, మంజీత్ చిల్లర్ చెరో రెండు పాయింట్లు రాబట్టారు. మెుత్తంగా నవీన్ కుమార్ ఈ 8వ సీజన్‌లో ఏకంగా 200 పాయింట్లు సాధించడం గమనార్హం. పట్నా జట్టులో సచిన్‌ 10, గుమన్‌ సింగ్‌ 9 పాయింట్స్ తో రాణించారు. 


Also Read: IPL 2022 Groups & Format: ఐపీఎల్ ఫార్మాట్‌లో మార్పు.. గ్రూప్-బిలో సన్‌రైజర్స్‌! ఏ జట్లతో పోటీ పడనుందో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి