IPL CSK vs PBKS: ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై-పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లో లివింగ్‌స్టోన్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 60 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధావన్ 33 (24) పరుగులతో రాణించగా... జితేశ్ శర్మ కొద్దిసేపు మెరుపులు మెరిపించాడు. జితేశ్ శర్మ 17 బంతుల్లో 3 సిక్స్‌లతో 26 పరుగులు చేశాడు. 14 పరుగులకే పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయిన దశలో ధావన్-లివింగ్‌స్టోమ్ భాగస్వామ్యం జట్టును గట్టెక్కించింది. చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్, ప్రిటోరియస్ చెరో 2 వికెట్లు తీయగా... ముకేశ్ చౌదరి, డీజే బ్రావో, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.


కుప్పకూలిన చెన్నై టాపార్డర్ :


పంజాబ్ విధించిన 181 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై కేవలం 36 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఎవరూ కనీసం 20 పరుగులు చేయలేకపోయారు. రాబిన్ ఊతప్ప (13), రుతురాజ్ గైక్వాడ్ (1), అంబటి రాయుడు (13) స్వల్ప స్కోర్లకే ఔట్ అవగా... కెప్టెన్ రవీంద్ర జడేజా (0), మొయిన్ అలీ (0) డకౌట్ అయ్యారు. ప్రస్తుతం శివం దూబే (35), ఎంఎస్ ధోనీ (10) పరుగులతో క్రీజులో ఉన్నారు. చెన్నై విజయానికి 39 బంతుల్లో 98 పరుగులు అవసరం. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లోనూ ఓటమి మూటగట్టుకునేలా కనిపిస్తోంది.


Also Read: RRR Collections: బాక్సాఫీస్ షేక్ అయ్యే కలెక్షన్స్... దిల్ రాజు పంట పండిందిగా...


DrugsQueenNiharika: నిహారికపై ట్విట్టర్‌లో ట్రోలింగ్... ట్రెండింగ్‌లో 'డ్రగ్స్ క్వీన్ నిహారిక' హాష్‌ట్యాగ్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook