క్వార్టర్స్ లోకి పీవీ సింధు
చైనాలో జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు క్వార్టర్స్ లోకి ప్రవేశించింది.
కౌలూన్ : చైనాలో జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన రెండో సీడ్ లో జపాన్ బ్యాట్మింటన్ క్రీడాకారిణి ఆయా ఒహోరి పై 21-14, 21-17 తేడాతో గెలిచి క్వార్టర్స్ లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. కాగా, రెండో సీడ్ లో సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ పరాజయం చెందారు.
పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సింధూదే పైచేయి. మ్యాచ్ సుమారు 40 నిమిషాలపాటు సాగింది. వరుసగా రెండు మ్యాచ్ లలో విజయాన్ని సాధించి సునాయాసంగా తదుపరి రౌండ్ లోకి ప్రవేశించింది. తాజా గెలుపుతో సింధూ తన ముఖాముఖి రికార్డును 3-0 తో మెరుగుపర్చుకుంది.