Syed Modi International Tournament: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు అంతర్జాతీయ స్థాయిలో వరుస ఓటముల నుంచి ఎట్టకేలకు ఊరట లభించింది. లక్నోలో జరుగుతున్న 'సయ్యద్​ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్​ టోర్నీ 2022' ఉమెన్స్​ సింగిల్స్​ ఫైనల్స్​లో విజయం సాధించింది. దీనితో అంతర్జాతీయ మ్యాచ్​లలో 2022కు మంచి ఆరంభం (PV Sindhu wins) చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ టోర్నీ ఫైనల్​ మ్యాచ్​లో పీవీ సింధు.. మన దేశానికే చెందిన మాల్​వికా బన్​సోద్​తో తలపడింది. 35 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్​లో.. 12-13, 21-16 తేడాతో ఆధిపత్యం కొనసాగించి.. విజయం (Syed Modi tourney finals) సాధించింది.


సెమీస్​లో ఇలా..


సెమీస్​లో రష్యాకు చెందిన ఎవ్​గెనియా కొస్సెత్సకయాతో తడబడింది సింధు. అయితే అమె మధ్యలోనే మ్యాచ్​ నుంచి తప్పుకోవడంతో..  సింధును విజేతగా ప్రకటించారు న్యాయనిర్ణేతలు. దీనితో ఫైనల్స్​కు చేరిన సింధు.. చివరి మ్యాచ్​లో తన సత్తా (Syed modi tourney women's single) చాటుకుంది.


మిక్స్​డ్​ డబుల్స్​లో 


ఇదే టోర్నీ మిక్స్​డ్​ డబుల్స్​ టైటిల్​ను ​ఇషాన్‌- తనీషా జోడీ విజయం గెలుచుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్​లో ఇషాన్‌- తనీషా జోడీ నాగేంద్ర, శ్రీవేద్య జోడీపై విజయం సాధించింది. 21-16, 21-12 తేడాతో టైటిల్​ను కైవసం చేసుకుంది.


Also read: ICC Awards: 'టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​'గా పాక్​ క్రికెటర్​.. ట్యామీ బ్యూమోంట్‌కు ఐసీసీ అవార్డు!!


Also read: IND vs PAK: వారిద్దరూ రాణించకపోతే.. టీమిండియాపై ఒత్తిడి తప్పదు: హఫీజ్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook