దుబాయ్‌: ఢిల్లీ క్యాపిటల్స్ ఆఫ్ స్పిన్నర్ రవింద్రన్ అశ్విన్ ( R Ashwin ) తన ప్రత్యర్థి ఆటగాళ్లకు ట్విటర్ ద్వారా ఓ వార్నింగ్ ఇచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ( DC vs RCB match ) జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ ఆరోన్ ఫించ్‌ను మన్కడింగ్‌ ( Mankading ) చేసే అవకాశం వచ్చినా.. అలా చేయకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేసిన అశ్విన్‌.. ఇదే విషయాన్ని ట్విటర్ ద్వారా చెబుతూ మరోసారి ఇలాంటి ఛాన్స్ ఇస్తే.. మన్కడింగ్ చేయకుండా మాత్రం ఊరుకోనని స్పష్టం చేశాడు. ఈ ఐపిఎల్ సీజన్ కి ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని స్పష్టంచేసిన అశ్విన్.. ఇక వార్నింగ్స్ ఉండవంటూ తేల్చిచెప్పేశాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇకపై జరిగే ఆటల్లో ఇలా ఎవరైనా ఆటగాడు క్రీజు వదిలి ముందుకు వెళ్తే.. కచ్చితంగా మన్కడింగ్‌ చేస్తా అని చెప్పిన రవిచంద్రన్ అశ్విన్.. తాను ఈ విషయాన్ని ఎటువంటి దాపరికాలు లేకుండా అధికారికంగానే చెబుతున్నా అంటూ మందలించాడు. ఆ తర్వాత తనని తప్పు పట్టి లాభం లేదని అశ్విన్ చెప్పకనే చెప్పేశాడన్న మాట. ఈ ట్వీట్‌లో ఢిల్లీ చీఫ్ కోచ్ రికీ పాంటింగ్‌ ( Ricky ponting ), ఆరోన్ ఫించ్‌ను ( Aaron Finch ) ట్యాగ్‌ చేశాడు. ఏదేమైనా తాము స్నేహితులమే అంటూ అశ్విన్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఐపిఎల్ 2020లో తమ బౌలర్స్ మన్కడింగ్‌ చేయకూడదని పాంటింగ్‌ గతంలోనే సూచించిన నేపథ్యంలో అశ్విన్ అతడినే ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేయడం గమనార్హం.  

ఇదిలావుంటే, మరోవైపు అశ్విన్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ ( Memes viral on R Ashwin ) అవుతున్నాయి. పాంటింగ్‌కే భయపడి ఆగిపోయావా అశ్విన్ అంటూ నెటిజెన్స్ జోకులు పేల్చుతున్నారు.