KL Rahul speaks on who is going to bat for India at No 5 in IND vs SA 1st Test: టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇరు జట్లు (IND vs SA) మూడు టెస్టులు, మూడు వన్డే మ్యాచుల సిరీస్‌ ఆడనున్నాయి. ఆదివారం (జనవరి 26) సెంచూరియన్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. సెంచూరియన్‌ పార్కులో మధ్యాహ్నం 1 గంటకి టాస్ పడనుండగా.. మధ్యాహ్నం 1.30 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఐదవ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. అజింక్య రహానే, హనుమ విహారి (Rahane or Vihari)లలో ఒకరికే అవకాశం దక్కనుంది. ఈ అంశంపై టెస్ట్ వైస్ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) స్పందించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి టెస్ట్ నేపథ్యంలో భారత టెస్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మీడియాతో మాట్లాడుతుండగా.. అజింక్య రహానే, హనుమ విహారిలలో ఎవరు ఐదవ స్థానంలో ఆడతారు అని ఓ రిపోర్టర్ ప్రశ్న వేశాడు. 'ఇది చాలా కష్టమైన ప్రశ్న. అజింక్య రహానే గత సిరీస్‌లలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. జింక్స్ తన కెరీర్‌లో కీలకమైన నాక్స్ ఆడాడు. ముఖ్యంగా మెల్‌బోర్న్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. పుజారాతో కలిసి నిర్మించిన ఆ భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది. రహానే కీలక ఆటగాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. తాజాగా కాన్పూర్‌లో సెంచరీ చేశాడు. హనుమ విహారి జట్టు కోసం మంచి ఇన్నింగ్స్ చాలా ఆడాడు. ఐదవ స్థానం కోసం చర్చలు జరుపుతున్నాం. రేపు తుది నిర్ణయం తీసుకుంటాం' అని చెప్పాడు. 


Also Read: Harbhajan Singh Retirement: హర్భజన్ సింగ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?


'తొలి టెస్టు ప్రారంభానికి చాలా ముందుగానే దక్షిణాఫ్రికాకు రావడం మాకు కలిసొచ్చింది. ఇక్కడి పరిస్థితులను మరింత మెరుగ్గా తెలుసుకునే అవకాశం లభించింది. దక్షిణాఫ్రికాలో ఆడటం ఇతర దేశాల కంటే భిన్నం. ఇక్కడ పిచ్‌లు ఒకదానికొకటి భిన్నంగా ప్రవర్తిస్తాయి. నేను ఇక్కడ ఎక్కువగా ఆడలేదు. కానీ టెన్నిస్ బంతితో ఆడిన అనుభవం నాకు ఉపయోగడపనుంది. మేము వచ్చిన ప్రతిసారీ  వికెట్ భిన్నంగా ఉంటుంది. అది బ్యాటర్లు మరియు బౌలర్లకు పెద్ద సవాలుగా మారుతుంది. ఇక్కడ అన్ని జట్లు నలుగురైదుగురు బౌలర్లతో ఆడుతాయి. ప్రతి జట్టు పది వికెట్లు తీయాలని కోరుకుంటుంది. మేము అంతే. ఆడిన ప్రతి టెస్ట్ మ్యాచ్‌లో ఖచ్చితమైన వ్యూహాన్ని అమలు పరుస్తాం' అని కేఎల్ రాహుల్ చెప్పాడు. 


గాయంతో స్టార్ ఓపెనర్ రోహిత్‌ శర్మ (Rohit Sharma) దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమయిన విషయం తెలిసిందే. రోహిత్‌ టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో లేకపోవడంతో  కేఎల్‌ రాహుల్‌ (KL MRahul)తో కలిసి మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. మరోవైపు రోహిత్‌ గైర్హాజరీలో విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీలో రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా విధులు నిర్వర్తించనున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఈసారి సిరీస్ పట్టాలని కోహ్లీసేన చూస్తోంది. తొలి టెస్ట్ కోసం టీమిండియా తమ ప్రాక్టీస్‌లో జోరు పెంచింది. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పర్యవేక్షణలో ప్లేయర్స్ చమటోడ్చుతున్నారు. 


Also Read: Trolls on Hero Nani: హీరో నానిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. సినిమా టికెట్లపై స్పందించడమే కారణమా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook