Rahkeem Cornwall smashesh double hundred in T20 Cricket: టీ20 క్రికెట్ అంటేనే బ్యాటర్లు పండగ చేసుకుంటారు. ప్రతి బంతిని బౌండరీ బాదేందుకు ప్రయత్నిస్తుంటారు. ఫోర్లు, సిక్సులు బాదుతూ బౌలర్లపై విరుచుకుపడతారు. ఈ క్రమంలోనే కొందరు బ్యాటర్లు హాఫ్ సెంచరీ చేస్తుంటారు. చాలా కొద్దిమంది మాత్రమే సెంచరీ బాదుతుంటారు. టీ20 క్రికెట్‌లో సెంచరీ చేయడమే గగనం అనుకుంటే.. ఏకంగా డబుల్ సెంచరీ నమోదైంది. వెస్టిండీస్ బాహుబలి రఖీమ్ కార్న్‌వాల్ టీ20ల్లో డబుల్ సెంచరీ బాదాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అట్లాంటా ఓపెన్ 2022 లీగ్‌లో రఖీమ్ కార్న్‌వాల్ డబుల్ సెంచరీ చేశాడు. అట్లాంటా ఫైర్ తరఫున బరిలోకి దిగిన కార్న్‌వాల్.. స్క్వేర్ డ్రైవ్‌ జట్టుపై విరుచుకుపడి ద్విశతకం సాధించాడు. వెస్టిండీస్ భారీ కాయుడు 77 బంతుల్లో 205 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కార్న్‌వాల్ 26 సిక్సులు, 17 ఫోర్ల సాయంతో 205 రన్స్ చేశాడు. అతడు 266కి పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం విశేషం. టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ నమోదవడం ఇదే మొదటిసారి. 


అట్లాంటా ఓపెన్ 2022లో భాగంగా బుధవారం (అక్టోబరు 5) అట్లాంటా ఫైర్, స్క్వేర్ డ్రైవ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో రఖీమ్ కార్న్‌వాల్ విధ్వంసంతో ముందుగా బ్యాటింగ్ చేసిన అట్లాంటా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 326 పరుగులు చేసింది. ఆపై స్క్వేర్ డ్రైవ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 రన్స్ మాత్రమే చేసింది. దాంతో 172 పరుగుల తేడాతో అట్లాంటా విజయం సాధించింది. 



అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా ప్లేయర్ ఆరోన్ ఫించ్ ఉన్నాడు. 2018 జులై 3న హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 76 బంతుల్లో 172 పరుగులు చేశాడు. ఫించ్ తన ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 10 సిక్సులు బాదాడు. ఇక ప్రాంచైజీ లీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ మొదటి జాబితాలో ఉం ఏడు. 2013 ఐపీఎల్ సీజన్లో బెంగళూరు తరఫున ఆడిన గేల్.. పుణే వారియర్స్‌పై 66 బంతుల్లోనే 175 రన్స్ చేశాడు. గేల్ తన ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 17 సిక్సులు బాదాడు. తాజాగా రఖీమ్ కార్న్‌వాల్ 77 బంతుల్లో 205 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.


Also Read: Kyle Mayers Six: వాట్ ఏ షాట్.. నెవర్ బిఫోర్ సిక్స్! వీడియో చూస్తే మతిపోవాల్సిందే


Also Read: ఆదిపురుష్ బ్యాన్ చేయండి.. టీజర్ రిలీజ్ చేసిన అయోధ్య ప్రధాన పూజారి షాకింగ్ డిమాండ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook