Who Is Samit Dravid: భారత క్రికెట్‌లోకి మరో వారసుడు వచ్చేస్తున్నాడు. భారత జట్టులో విజయవంతమైన ఆటగాడిగా.. కెప్టెన్‌గా.. సక్సెస్‌ఫుల్‌ కోచ్‌గా నిలిచిన రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు సమిత్‌ ద్రావిడ్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నాడు. ఆస్ట్రేలియాతో మూడు ఫార్మాట్ల సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన అండర్‌ 19 భారత జట్టులో సమిత్‌కు అవకాశం లభించింది. తొలి పోరులోనే గట్టి ప్రత్యర్థినే సమిత్‌ ఢీకొట్టబోతున్నాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Champai Soren: మాజీ ముఖ్యమంత్రి రాజీనామా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే పనిలో బీజేపీ?


 


సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలలో అండర్‌ 19 భారత్‌, ఆస్ట్రేలియా మధ్య వన్డే, టెస్టు సిరీస్‌ జరగనుంది. మహ్మద్‌ అమాన్‌ సారథ్యంలో భారత్‌ వన్డే సిరీస్‌ ఆడనుండగా.. సోహమ్‌ పతర్‌ద్వాన్‌ కెప్టెన్సీలో టెస్ట్‌ సిరీస్‌ జరగనుంది. ఈ మేరకు వన్డే, టెస్టు సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి జట్లను ప్రకటించింది. ఈ రెండు జట్లలోనూ రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు సమిత్‌ ద్రవిడ్‌కు చోటు లభించింది. దేశవాళీ క్రికెట్‌లో అంతగా ప్రదర్శన లేకపోయినా సమిత్‌ను ఎంచుకోవడం గమనార్హం.

Also Read: Corruption: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లో లంచావతారం? ఇది నిజమేనా?


 


కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్న సమిత్‌ ద్రవిడ్‌ ప్రస్తుతం మహారాజ టీ20 ట్రోఫీలో మైసూర్‌ వారియర్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఈ టోర్నీలో మిడిలార్డర్‌లో ఆడిన సమిత్‌ పెద్దగా ప్రదర్శన చేయలేదు. ఏడు ఇన్నింగ్స్‌లో కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. ఇక అతడి మీడియం పేస్‌ బౌలింగ్‌ టోర్నీలో అవసరం రాలేదు. ప్రస్తుతం ఆ టోర్నీలో మైసూర్‌ వారియర్స్‌ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.


కూచ్‌ బిహార్‌ ట్రోఫీలో సమిత్‌ ద్రవిడ్‌ కీలకంగా వ్యవహరించాడు. ఈ టోర్నీలో మాత్రం సమిత్‌ 362 పరుగులు చేయడమే కాకుండా 16 కీలకమైన వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని బీసీసీఐ అండర్‌ 19 జట్టులోకి తీసుకున్నదని తెలుస్తోంది. 18 ఏళ్ల సమిత్‌ ఆస్ట్రేలియా సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తారనే ఆశాభావంతో ఉన్నారు.


పాండిచ్చేరి వేదికగా సెప్టెంబర్‌ 21, 23, 26 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక చెన్నై వేదికగా సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 7వ తేదీ వరకు టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సిరీస్‌ యువ క్రికెటర్లకు సదావకాశంగా నిలవనుంది. ఐపీఎల్‌ మెగా వేలం రానున్న నేపథ్యంలో ఇక్కడ ప్రదర్శన చేస్తే సులువుగా ఐపీఎల్‌లో మెరిసే అవకాశం రావొచ్చు. అందుకే ఈ సిరీస్‌లో సత్తా చాటేందుకు భావి క్రికెటర్లు ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter