Rain may stops India vs Sri Lanka 2nd T20: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో లక్నో వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న భారత్.. మరో సమరానికి సిద్దమైంది. శనివారం సాయంత్రం ధర్మశాల వేదికగా జరగనున్న రెండో టీ20లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి.. మరో టీ20 ఉండగానే సిరీస్ పట్టాలని రోహిత్ సేన చూస్తోంది. అయితే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రెండో టీ20 మ్యాచ్‌కు వరణుడి ముప్పు పొంచి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్, శ్రీలంక జట్ల మధ్య మరికొద్ది గంటల్లో ఆరంభం కానున్న రెండో టీ20 మ్యాచ్‌కు వేదికైన ధర్మశాలలో ప్రస్తుతం ఆకాశమంతా మబ్బులు పట్టి ఉంది. మధ్యాహ్నం 2 తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హిమాచల్ ప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా చిరు జల్లులు కురిసే అవకాశం ఉందట. వర్షం కురిసే అవకాశాలు 90 శాతం వరకు ఉన్నాయట. మ్యాచ్ రద్దవకపోయినా.. ఆటకు మాత్రం ఆటకం కలగనుందట. 


ప్రస్తుతం ధర్మశాలలో గాలి గంటకు 10 కి.మీ వేగంతో వీస్తోందట. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈరోజు 7 డిగ్రీల సెల్సియస్ నుండి 10 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుందట. ఇదే వేదికపై ఆదివారం జరిగే మ్యాచుకు కూడా వర్షం ముప్పు పొంచివుందని తెలుస్తోంది. ఇది భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. చాలా కాలం తర్వాత మైదానంలోకి వెళ్లి తమకు ఇష్టమైన ప్లేయర్ ఆటను చుద్దామనుకున్న వారికి నిరాశ తప్పకపోవచ్చు. 


ఇక టీ20 సిరీస్ నుంచి టీమిండియా యువ క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ తప్పుకున్నాడు. రుతురాజ్‌ కుడిచేయి మణికట్టు గాయం తిరగబెట్టిందని, బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. దాంతో భారత్ తొలి మ్యాచులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. రుతురాజ్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ జట్టులోకి వస్తాడని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు. 


Also Read: DJ Tillu OTT: ఓటీటీలోకి 'డీజే టిల్లు'.. త్వరలోనే టిల్లుగాడి లొల్లి షురూ!!


Also Read: Samantha Viral Post: 'నా ప్రేమ కథ ఎప్పటికీ ముగియదు'.. సమంత ఎమోషనల్ పోస్ట్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook