Yuzvendra Chahal: ఐపీఎల్ 2022లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు యజువేంద్ర చాహల్ మరో మైలురాయిని చేరుకున్నాడు. దుష్మత చమీరాను అవుట్ చేసి ఆ ఘనత సాధించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ వేదికగా ఆర్ఆర్ జట్టు ఆటగాడు యజువేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 150 వికెట్లు సాధించిన ఆరవ బౌలర్‌గా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ దుష్మంత చమీరాను అవుట్ చేయడం ద్వారా చాహల్ ఈ ఘనత సాధించాడు. 


ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 150 వికెట్లు తీసినవాళ్లు ఐదుగురు ఉన్నారు. డ్వేల్ బావ్రో 173 వికెట్లతో తొలిస్తానంలో ఉండగా..మలింగ్ 170 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక 166 వికెట్లతో అమిత్ మిశ్రా మూడవ స్థానంలో ఉన్నాడు. పీయూష్ చావ్లా 157 వికెట్లతో నాలుగవ స్థానంలో నిలవగా..150 వికెట్లతో హర్భజన్ సింగ్ ఐదవ స్థానంలో ఉన్నాడు. చాహల్ 150 వికెట్లు తీసి హర్భజన్ సింగ్ సరసన నిలిచాడు. చాహల్ ఈ ఘనత సాధించేందుకు 118 మ్యాచ్‌లు ఆడాడు. నిన్నటి మ్యాచ్‌లో చాహల్ 4 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు.


ఇప్పటి వరకూ 118 ఐపీఎల్ మ్యాచ్‌లలో 150 వికెట్లు సాధించిన యజువేంద్ర చాహల్‌కు తొలి 50 వికెట్లు తీసేందుకు 40 మ్యాచ్‌లు ఆడగా..మొత్తం 88 మ్యాచ్‌లలో వంద వికెట్లు పూర్తి చేశాడు. ఇంకా అద్భుతమైన కెరీర్ మిగిలున్నందున మరో 50 వికెట్లు సులభంగా తీసేస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. 


Also read: LSG vs RR: స్టోయినిస్ వృధా చేసిన ఆ మూడు బంతులే లక్నో కొంప ముంచాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook