కపిల్ దేవ్ పాత్రలో నటించడం అదృష్టమే..!
భారత క్రికెట్ జట్టు 1983లో గెలుచుకున్న వరల్డ్ కప్ ఘట్టాన్ని తెరకెక్కిస్తూ రూపొందిస్తున్న చిత్రమే `83`.
భారత క్రికెట్ జట్టు 1983లో గెలుచుకున్న వరల్డ్ కప్ ఘట్టాన్ని తెరకెక్కిస్తూ రూపొందిస్తున్న చిత్రమే '83'. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రను నటుడు రణ్ వీర్ సింగ్ పోషించనున్నారు. ఇదే విషయం పై ఆయన స్పందిస్తూ 'అంతటి గొప్ప లెజండరీ ప్లేయర్ పాత్రలో నటించడం అంటే సాహసమే. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను' అని పీటీఐకి చెప్పారు రణ్‌వీర్.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రారంభవ్వక ముందు జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కే 'గల్లీ బాయ్' చిత్రంతో పాటు, రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కే 'శింబా' చిత్రంలో కూడా నటించనున్నారు రణ్‌వీర్. ప్రస్తుతం ఈయన అల్లాయుద్దీన్ ఖిల్జీ పాత్రలో నటించిన 'పద్మావతి' చిత్రం వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈయన కపిల్ దేవ్‌గా నటించబోయే '83' చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు.