ఓవల్: పొట్టి క్రికెటైనా టీ20లో క్లీన్ స్వీప్ జరగడం చాల అరుదు. అటువంటి అరుదైన రికార్డుండు సొంత చేసుకుంది భారత్. ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్ గడ్డపై భారత్ మొదటిసారి టీ20 సిరీస్ ను సాధించిన కోహ్లీసేన చరిత్ర సృష్టించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఆదివారం జరిగిన చివరి ఐదవ టీ20లో భారత్ చేతిలో కివీస్ ఓడిపోయింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(60 రిటైర్డ్‌హర్ట్‌) అర్థ సెంచరీతో అలరించాడు. కేఎల్‌ రాహుల్‌(45), శ్రేయస్‌ అయ్యర్‌(33 నాటౌట్‌)లు రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో కుగ్‌లీన​ రెండు వికెట్లు సాధించగా.. బెన్నెట్‌కు వికెట్‌ లభించింది. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 17 వద్దే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.


తరవాత బ్యాటింగ్ చేసిన టిమ్‌ సెయిఫర్ట్‌ (50), రాస్‌ టేలర్‌ (53)లు అర్ధసెంచరీలతో మెరుపులు మెరిపించి జట్టును విజయం దిశగా నడిపించారు. దీంతో న్యూజిలాండ్ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ, భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకుని వరుస వికెట్లను పడగొట్టడంతో కివీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులే చేసింది. దీంతో కివీస్ 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా, నవదీప్‌ సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌లు చెరో 2 వికెట్లు, వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ తీశారు.


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..