Afghanistan Cricket: అఫ్గాన్ క్రికెట్ జట్టుకు గట్టి షాక్.. కెప్టెన్‌గా తప్పుకొన్న రషీద్‌ఖాన్
Afghanistan Cricket: టీ20 ప్రపంచకప్ ముందు అఫ్గన్ కు గట్టి షాకే తగిలింది. కెప్టెన్ బాధ్యతల నుంచి రషీద్ ఖాన్ తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
Rashid Khan steps down as Afghanistan captain: ఐసీసీ టీ20 ప్రపంచకప్(ICC T20 World Cup 2021) ప్రారంభానికి ముందే అఫ్గానిస్థాన్ క్రికెట్(Afghanistan Cricket)కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న ప్రముఖ స్పిన్నర్ రషీద్‌ఖాన్(Rashid Khan) ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. అఫ్గాన్ క్రికెట్ బోర్డు తనని సంప్రదించకుండానే టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించడంపై రషీద్ ఖాన్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించాడు.
‘అఫ్గాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా, బాధ్యతాయుతమైన సభ్యుడిగా ఉన్న నాకు.. ప్రపంచకప్ జట్టు ఎంపికచేసే ప్రక్రియలో పాలుపంచుకోవాల్సిన కనీస బాధ్యత ఉంటుంది. అలాంటిది అఫ్గాన్ క్రికెట్ బోర్డు కానీ, సెలెక్షన్ కమిటి కానీ నన్ను సంప్రదించకుండానే జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నా. అయితే, అఫ్గాన్ క్రికెట్ జట్టుకు ఆడటం ఎప్పటికీ నాకు గర్వకారణమే’ అని రషీద్ పేర్కొన్నాడు. కాగా, జులైలో ఆ జట్టు చీఫ్ సెలెక్టర్ అసదుల్లా ఖాన్(Asadullah Khan) కూడా తన పదవికి రాజీనామా చేశారు. క్రికెట్‌తో సంబంధంలేని వ్యక్తుల ప్రమేయం బోర్డులో ఎక్కువైందని ఆయన వెల్లడిస్తూ ఆ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Team india for T20 world cup: టీ20 వరల్డ్ కప్‌కి వెళ్లే భారత జట్టు ఇదే.. shikhar dhawan తప్పని నిరాశ
అయితే ఇటీవలి కాలంలో ఆ జట్టులో ఆడకపోయినా.. పలువురిని ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేశారు. ఈ అంశం వివాదాస్పదంగా మారింది. 2019లో ఏడాది పాటు నిషేధానికి గురైన మహ్మద్ షాహ్జాద్‌తో పాటు పేస్‌బౌలర్లు షాపూర్ జద్రాన్, దావ్లత్ జద్రాన్, 2016లో చివరి మ్యాచ్ ఆడిన హమీద్ హసన్ లాంటి ఆటగాళ్లను ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికచేశారు. ఈ నేపథ్యంలోనే రషీద్ అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.
టీమ్ ఇదే..
రషీద్‌ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, రహ్మానుల్లా గుర్బాజ్, కరీమ్ జనత్, హజ్రతుల్లా జాజాయ్, గుల్బాడిన్ నైబ్, ఉస్మాన్ ఘని, నవీన్ ఉల్ హక్, అస్ఘర్ అఫ్గాన్, హమీద్ హసన్, మహ్మద్ నబి, షరాఫుద్దీన్ అష్రాఫ్, నజీబుల్లా జద్రాన్, దావ్లత్ జద్రాన్, హష్మతుల్లా షాహిది, షాపూర్ జద్రాన్, మహ్మద్ షహ్జాద్, కాయిస్ అహ్మద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook