Rashid Khan To Ashwin: టీ20 వరల్డ్ కప్ లో నవంబరు 7న కీలక మ్యాచ్ జరగనుంది. అయితే అందులో ఇండియా ఆడబోవడం లేదు. మన ప్రత్యర్థులైన న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఎందుకు అంతటి ఆసక్తి అని అనుకుంటున్నారా? అవును.. నిజమే, ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ మ్యాచ్ లో కచ్చితంగా అఫ్గానిస్థాన్ గెలవాలని టీమ్ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు ఓడితేనే టీమ్ఇండియా సెమీస్ కు వెళ్లే అవకాశం ఉంది. ఒక వేళ ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే టోర్నీ నుంచి భారత జట్టు వైదొలగడమే! ఇదే విషయమై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సోషల్ మీడియాలో ఇప్పుడా ట్వీట్ వైరల్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రాలేకపోయిన ముజీబ్‌ను ఆఫ్ఘనిస్థాన్ టీమ్ కివీస్‌తో జరిగే మ్యాచులో ఆడించేందుకు ఛాన్స్ ఉంది. అశ్విన్ మొదట ఆఫ్ఘనిస్థాన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అనంతరం తన మనసులోని మాటను బయటపెట్టాడు. ముజీబ్‌కు భారతీయ ఫిజియో నుంచి ఏదైనా సహాయం అందించగలిగితే నేను ఇష్టపడతానంటూ పేర్కొన్నాడు. కివీస్‌తో జరిగే మ్యాచ్‌కి ముందు అతడు ఫిట్‌గా ఉంటాడని భావిస్తున్నాం.


అశ్విన్ వ్యాఖ్యలపై స్పందించిన అప్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలుగులో ఫన్నీగా ట్వీట్ చేశాడు. “బ్రదర్ టెన్షన్ పడకు. మా టీమ్ ఫిజియో ప్రశాంత్ పంచాడ చూస్తున్నారు” అని సమాధానం ఇచ్చాడు. ‘చూసుకుంటున్నారు’ అని తెలుగులో ట్వీట్ చేయడం వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్ ఖాన్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులున్నారన్న విషయం తెలిసిందే.


మరోవైపు అఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్‌పై భారీ విజయాలు నమోదు చేయడం వల్ల భారత్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కానీ, ప్రస్తుతం భారత్ ఆశలన్నీ అఫ్గానిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌పై పడ్డాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే భారత్ ఆశలన్నీ అక్కడితో ముగిసిపోతాయి. కానీ, ఆఫ్ఘనిస్థాన్ గెలిస్తే మరుసటి రోజు నమీబియాతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి భారత్ సెమీస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.


Also Read: Jadeja Press Conference: ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే ఏం చేస్తారు?.. చమత్కారంగా జవాబిచ్చిన జడేజా


Also Read: T20 WC 2021 NZ Vs NAM: నమీబియాపై న్యూజిలాండ్ ఘన విజయం.. సెమీస్‌ రేసులో ముందడుగు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook