R Ashwin may not get a chance to play in Test series vs South Africa feels Steve Harmison: సొంతగడ్డపై న్యూజీలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీసును 1-0తో గెలిచిన టీమిండియా.. ఇక విదేశీ గడ్డపై దక్షిణాఫ్రికాతో అసలు సమరంకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 26 నుంచి భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టుపై ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ స్టీవ్‌ హార్మిసన్‌ (Steve Harmison) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఆలోచనా విధానాన్ని అంచనా వేయడం కష్టమన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో 'ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా నిలిచిన వెటరన్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (R Ashwin)ను దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్ట్‌ సిరీస్‌లో పక్కకుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని సెటైర్ వేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూజీలాండ్‌తో సోమవారం ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో ఆర్ అశ్విన్‌ 11.35 ఎకానమీ రేట్‌తో 14 వికెట్లు పడగొట్టాడు. ప్రతి ఇన్నింగ్స్‌లో వికెట్లు తీశాడు. అంతేకాకుండా బ్యాట్‌తో 70 పరుగులు చేశాడు. అందులో 38 పరుగులు టాప్ స్కోర్‌. అయినా విరాట్ కోహ్లీ ఆలోచనా విధానాన్ని అంచనా వేయడం చాలా కష్టం కాబట్టి ప్రొటీస్ సిరీస్‌లో ఫామ్‌లో ఉన్న అశ్విన్ భవితవ్యాన్ని నిర్ణయించడం కష్టమని స్టీవ్‌ హర్మిసన్ పేర్కొన్నాడు. 'భారత జట్టు కూర్పు విషయంలో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిర్ణయాలే కీలకం. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ క్రికెట్‌లో అశ్విన్‌ ఆడడని ఈ ప్రపంచంలో ఎవరైనా ఊహించారా?. విరాట్ ఆలోచనా విధానం ఏమిటో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అర్ధం కాదు' అని హర్మిసన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.


Also Read: Flipkart Sale: రూ.30 వేల కంటే తక్కువ ధరతో iPhone 12 మీ సొంతం చేసుకోండి!


'కివీస్ సిరీస్‌లో శతకాలు చేసిన శ్రేయాస్ అయ్యర్ మరియు మయాంక్ అగర్వాల్‌ దక్షిణాఫ్రికాకు వెళ్లి తుది జట్టులో ఆడతారని మీరు అనుకుంటారు. ఫామ్ లేమితో తంటాలు పడుతున్న అజింక్య రహానే మరియు చేతేశ్వర్ పుజారా ఆడినా నాకు ఆశ్చర్యం కలిగించదు.ఆర్  అశ్విన్ ఆడకపోయినా నాకు ఆశ్చర్యం వేయదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆలోచనా విధానాన్ని అంచనా వేయడం కష్టం. రిషబ్ పంత్‌ నం. 6లో, రవీంద్ర జడేజా 7లో ఆడడం జట్టుకు మంచిది. అక్షర్ పటేల్, అశ్విన్ బ్యాటింగ్ చేయగలరు. కానీ జడేజా 7వ స్థానంలో  చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దక్షిణాఫ్రికాలో జడేజా సహా ఇంకో స్పిన్నర్‌కు అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నా' అని హర్మిసన్ చెప్పుకొచ్చాడు. 


Also Read: UAE Weekend: అక్కడ నాలుగున్నర రోజులే పనిదినాలు.. శుక్రవారం మధ్యాహ్నం నుంచే వీకెండ్ మొదలు!!


కరోనా వైరస్ కారణంగా రివైజ్డ్ షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (CSA) తాజాగా ప్రకటించింది. మూడు టెస్టులోని మొదటి మ్యాచ్‌ సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో డిసెంబరు 26న మొదలు కానుంది. రెండో టెస్టు 2022 జనవరి 3-7 మధ్య జొహాన్నెస్‌బర్గ్‌లో, మూడో టెస్టు 11-15 మధ్య కేప్‌టౌన్‌లో జరగనున్నాయి. ఇక వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు జనవరి 19, 21, 23న జరుగుతాయి. తొలి రెండు వన్డేలు పార్ల్ వేదికగా కాగా.. మూడో వన్డేకు కేప్‌టౌన్ ఆతిథ్యం ఇవ్వనుంది. టెస్ట్ సిరీస్ కోసం ప్రొటీస్ ఈ రోజు జట్టును ప్రకటించగా..  మంగళవారమే టీమిండియా (Team India) కూడా ప్రకటించే అవకాశం ఉంది.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook