Jadeja pushpa video: అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప(Pushpa Movie). ఇటీవల రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. వసూళ్ల సునామీ సృష్టిస్తూ...దూసుకుపోతుంది. ఈ చిత్రంలోని పాటలు, డైలాగ్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'తగ్గేదే లే' అన్న డైలాగ్ అభిమానుల్లో గుండెల్లో నాటుకుపోయింది. ఈ డైలాగ్ పై ఇప్పటికే అభిమానులు, సినీ ప్రియులు తమదైన స్టైల్​లో రీల్స్​ చేస్తూ..అలరిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) కూడా తనదైన స్టైల్​లో ఈ డైలాగ్ చెప్పి అభిమానులను మెస్మరైజ్ చేశాడు. మాసిన గడ్డంతో 'పుష్ప' లుక్​లో కనిపిస్తూ .. 'పుష్ప.. పుష్పరాజ్​ నీ యవ్వ తగ్గేదే లే' అంటూ సోషల్​మీడియా(Social Media)లో ఓ వీడియోను పోస్ట్​ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకు లైక్స్, కామెంట్స్ తో దుమ్మలేపుతున్నారు నెటిజన్స్. 


Also Read: Samantha: 'పుష్పరాజ్‌గా బన్నీ అదరగొట్టేశారు..ఆయనను స్పూర్తిగా తీసుకుంటా'..: సమంత


తాజాగా జడేజా వీడియోపై బన్నీ(Allu Arjun) కూడా స్పందించాడు. 'సూపర్'​ అంటూ ఎమోజీని షేర్​ చేశారు. కాగా, 'నీ అంత బాగా చేయలేదులే' అంటూ తిరిగి బదులిచ్చాడు జడేజా. ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్​ క్రికెటర్​ వార్నర్​ కూడా 'పుష్ప' సినిమాలోని 'ఏయ్​ బిడ్డా ఇది నా అడ్డా' పాటను అనుకరిస్తూ షేర్​ చేసిన వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 





 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి