Ravindra Jadeja Does Pushparaj Thaggede Le Celebration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా అన్ని భారతీయ భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి సాంగ్, డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో దేశవ్యాప్తంగా ఏడ చూసినా.. పుష్ప మేనియానే ఇప్పటికీ నడుస్తోంది. ఎవరిని కదిలించినా పుష్ప డైలాగులకో, పాటలకో చిందులేస్తున్నారు. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ లైవ్ మ్యాచ్‌లోనే అల్లు అర్జున్ మేనరిజంను చేసి చూపించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్నోలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 'పుష్ప' సీన్ చూపించాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌లోని 10వ ఓవర్‌లో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేష్ చండిమాల్‌ను జడ్డూ అవుట్ చేశాడు. కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్ పట్టడంతో చండిమాల్‌ పెవిలియన్ చేరాడు. వికెట్ తీసిన ఆనందంలో పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ 'తగ్గేదేలే' అనే మేనరిజంను జడేజా చేశాడు. 


దినేష్ చండిమాల్‌ వికెట్ అనంతరం అల్లు అర్జున్‌లా రవీంద్ర జడేజా కూడా 'తగ్గేదేలే' అంటూ గడ్డం కింది చేయి పెట్టి పైకి లేపాడు. లైవ్‌ మ్యాచ్‌లోనే జడేజా తగ్గేదేలే అనడంతో కెప్టెన్ రోహిత్ శర్మ నవ్వులు పూయించాడు. ఇక కామెంటరీ బాక్స్‌లో ఉన్న భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ 'రవీంద్ర పుష్ప' అని పేర్కొన్నాడు. దాంతో కామెంటరీ బాక్స్‌లో కూడా అందరూ సరదాగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన ఫాన్స్ అందరూ జడ్డూ స్టైల్‌కు ఫిదా అవుతున్నారు. అంతకుముందు జడేజా పుష్ప రాజ్ గెటప్‌లోకి మారిపోయిన విషయం తెలిసిందే. 



గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడిన రవీంద్ర జడేజా చాలా రోజుల తర్వాత భారత జట్టులోకి వచ్చాడు. గాయం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన జడ్డూ చాలా ఉత్సాహంగా కనిపించాడు. తగ్గేదేలే అంటూ ఓ వికెట్ కూడా తీశాడు. తొలి టీ20 మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. అంతర్జాతీయ క్రికెటర్లు చాలామంది 'పుష్ప' సినిమాలోని డ్యాన్సులు, డైలాగులతో అదరగొడుతున్న విషయం తెలిసిందే. 


Also Read: Bheemla Nayak Movie: మొదలైన 'భీమ్లా నాయక్‌' సందడి.. థియేటర్ల వద్ద పవన్ ఫాన్స్ హంగామా!!


Also Read: Reena Dwivedi New Look: అప్పుడు ఎల్లో సారీ.. ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్‌! ఈ ఎలక్షన్ ఆఫీసర్‌ది చూపుతిప్పుకోని అందం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook