Ravindra Jadeja Stunning Catch: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. డైవింగ్ చేసి మరీ రవింద్ర జడేజా పట్టుకున్న ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారడమే కాకుండా ఒకప్పుడు యువరాజ్ సింగ్ పట్టుకున్న ఐకానిక్ క్యాచ్‌ని గుర్తుచేసింది. రవీంద్ర జడేజా పట్టుకున్న ఈ అద్భుతమైన క్యాచ్ మార్నస్ లాబుషాగ్నే క్రీజు నుంచి డిస్మిస్ అయ్యాడు. మిచెల్ మార్ష్‌ను ఔట్ చేసిన తర్వాత మరో ఓవర్‌ బౌలింగ్ కి వచ్చిన కుల్దీప్ యాదవ్‌ విసిరిన బంతిని మార్నస్ ఆఫ్ సైడ్‌లో షాట్ కోసం ట్రైచేశాడు. మార్నస్ హిట్ ఇచ్చిన ఆ బంతిని రవీంద్ర జడేజా ఫుల్ స్ట్రెచ్‌లో డైవ్ చేసి ఒడిసి పట్టుకున్నాడు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



కారు యాక్సిడెంట్ ప్రమాదం కారణంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటకు దూరం కాగా అతడి స్థానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో వికెట్ కీపింగ్ చేసిన కే.ఎల్. రాహుల్ కూడా అదే తరహాలో స్టన్నింగ్ క్యాచ్ పట్టుకుని క్రికెట్ ప్రియులను ఔరా అని అనిపించేలా చేశాడు. కేఎల్ రాహుల్ పట్టిన ఈ అద్భుతమైన క్యాచ్ తో స్టీవ్ స్మిత్‌ పెవిలియన్ బాట పట్టిన సంగతి తెలిసిందే. 


మ్యాచ్ ఆరంభంలోనే తొలి ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ తన బంతితో ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేశాడు. మరోవైపు కే.ఎల్. రాహుల్ కూడా స్టీవ్ స్మిత్‌ను రనౌట్ చేయబోయినప్పటికీ.. లక్కీగా స్మిత్ ఆ డేంజర్ నుంచి సేవ్ అయ్యాడు. అయితేనేం.., మిచెల్ మార్ష్‌తో స్మిత్ కీలక భాగస్వామ్యాన్ని అడ్డుకట్ట వేస్తూ స్మిత్‌ 22 పరుగుల వద్ద ఉండగా రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టుకుని అతడిని పెవిలియన్ కి పంపించాడు.


మార్ష్, స్మిత్ ఇద్దరూ కలిసి వేగంగా పరుగులు రాబడుతూ భారత బౌలర్లను చికాకు పెడుతున్న సమయంలోనే.. 13వ ఓవర్లో హార్దిక్ పాండ్యా తన బంతితో స్మిత్‌ను డిస్మిస్ చేసి వారి భాగస్వామ్యానికి బ్రేకులేశాడు. స్మిత్ నిష్క్రమించిన తర్వాత మార్ష్ అదే వేగంతో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని సెంచరీ వైపు పరుగులు పెడుతున్న తరుణంలోనే రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శనతో 81 పరుగుల వద్ద తన వికెట్ కోల్పోయాడు.