Ravindra Jadeja takes incredible Catch to dismiss Jos Buttler: రవీంద్ర జడేజా.. క్రికెట్ ప్రేమికులకు ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బౌలింగ్, బ్యాటింగ్ మాత్రమే కాదు.. అంతకు మించి ఫీల్డింగ్ చేస్తాడు. టీమిండియా మాజీ మెరుపు ఫీల్డర్లు యువరాజ్ సింగ్, మొహ్మద్ కైఫ్, సురేష్ రైనాలను మించిపోయాడు. సెకండ్ల వ్యవధిలో వికెట్లను గిరాటేయడమే కాకుండా.. ఒట్టిచేత్తో స్టన్నింగ్ క్యాచ్‌లు కూడా పడతాడు. జడేజా వైపు బంతి వెళ్లిందంటే అది కచ్చితంగా క్యాచ్ అవుట్ అన్న మాదిరిగా ఫీల్డింగ్ చేస్తాడు. ప్రపంచంలోనే బెస్ట్‌ ఫీల్డర్‌గా పేరుగాంచిన జడేజా.. తాజాగా ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో మరోసారి తన ఫీల్డింగ్‌ విన్యాసం చూపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడో వన్డే మ్యాచ్‌లో జొస్ బట్లర్‌, లియామ్ లివింగ్‌స్టోన్‌ క్యాచ్‌లను టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అందుకున్నాడు. ఇందులో బట్లర్‌ క్యాచ్‌ మ్యాచ్‌కే హైలైట్‌ అని చెప్పొచ్చు. స్టార్ బ్యాటర్లు జానీ బెయిర్‌స్టో (0), జో రూట్‌ (0) విఫలం అయినా.. జాసన్ రాయ్ (41), బెన్ స్టోక్స్‌ (27), మొయిన్‌ అలీ (34) పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టును ఆదుకున్నారు. వీరు పెవిలియన్ చేరిన అనంతరం జాస్‌ బట్లర్‌ అర్థ సెంచరీ పూర్తి చేసుకొని మంచి ఊపుమీదున్నాడు. అతనికి తోడుగా లియామ్ లివింగ్‌స్టోన్‌ క్రీజులో ఉన్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం బలపడుతుందన్న తరుణంలో హార్దిక్‌ పాండ్యా మ్యాజిక్‌ చేశాడు. 



హార్దిక్‌ పాండ్యా 37వ ఓవర్ చివరి బంతిని షార్ట్‌ బాల్‌గా వేయగా.. జోస్ బట్లర్‌ డీప్‌స్వ్కేర్‌ లెగ్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. అక్కడ ఫీల్డర్ లేనందున కచ్చితంగా బౌండరీ వెళుతుందని అందరూ అనుకున్నారు. ఈ తరుణంలో దాదాపు 25 గజాల దూరం నుంచి చిరుతలా పరిగెత్తుకొచ్చిన రవీంద్ర జడేజా.. పూర్తిగా ఎడమ వైపునకు తిరిగి డైవ్‌ చేస్తూ అద్బుత క్యాచ్‌ అందుకున్నాడు. ఆపై కిందపడినా బంతిని మాత్రం వదలలేదు. ఇంకేముందు బట్లర్‌ (60; 80 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిరాశగా పెవిలియన్ చేరాడు. టీమిండియా ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Also Read: బాయ్ ఫ్రెండ్‌తో శృంగారం చేస్తారా.. జాన్వీ కపూర్ ఏం సమాధానం చెప్పారంటే?


Also Read: Gold Price Today July 18: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook