క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యపై పోలీస్ కానిస్టేబుల్ దాడి..!
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివా సోలంకిపై ఓ పోలీస్ కానిస్టేబుల్ దాడి చేశాడు.
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివా సోలంకిపై ఓ పోలీస్ కానిస్టేబుల్ దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్రాంతంలో షాపింగ్‌కని వచ్చిన జడేజా భార్య రివా కారు అనుకోకుండా పార్క్ చేసి ఉన్న కానిస్టేబుల్ బైక్‌ను ఢీక్కొట్టింది. దీంతో కానిస్టేబుల్ కారు డోర్ ఓపెన్ చేసి బూతులు తిడుతూ క్రికెటర్ భార్యను బయటకు లాగడానికి ప్రయత్నించాడు.
ఆమెపై అఘాయిత్యం చేయడానికి కూడా ప్రయత్నించాడు. ఈ సంఘటన తర్వాత రివా అసిస్టెంట్ కమీషనర్ స్థాయి అధికారికి సమాచారం అందించింది. ఈ క్రమంలో జామ్ నగర్ పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషనులో కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయంలో దుశ్చర్యకి పాల్పడిన కానిస్టేబుల్‌ను సంజయ్ అహిర్‌గా గుర్తించామని.. అతనిపై తగిన చర్య తీసుకుంటామని లేదా వేరే పోలీస్ స్టేషనుకి బదిలీ చేస్తామని అధికారులు తెలిపారు. రవీంద్ర జడేజా ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు.