Who is RCB captain in IPL 2022: ఐపిఎల్ టోర్నమెంట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వచ్చే ఏడాది నుంచి కేప్టేన్సీ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నానంటూ విరాట్ కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపిఎల్ 2021 టోర్నమెంట్ పూర్తయిన అనంతరం కేప్టేన్‌గా ఇక తాను కొనసాగబోనని ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ప్రకటించాడో అప్పటి నుంచే ఐపిఎల్‌ని ఫాలో అయ్యే అందరి మెదళ్లలో ఓ ప్రశ్న తలెత్తుతోంది. అదేమంటే.. వచ్చే ఏడాది జరగనున్న ఐపిఎల్ 2022 (IPL 2022 Rcb captain) టోర్నమెంట్‌లో బెంగళూరు జట్టు కెప్టేన్ అయ్యే ఛాన్స్, అర్హతలు ఎవరికి ఉన్నాయనే ప్రశ్న క్రికెట్ ప్రియులను వేధిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఇదే విషయమై ఆ జట్టు బౌలర్ యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal in IPL 2022) చిన్ననాటి క్రికెట్ గురు రణ్‌ధీర్ సింగ్ మాట్లాడుతూ.. '' యుజ్వేంద్ర చాహల్ అద్భుతమైన బౌలర్ అని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నేతృత్వం వహించేందుకు పరిగణనలోకి తీసుకునే ఆటగాళ్ల జాబితాలో అతడు కూడా సరైన ఎంపిక అవుతాడు'' అని అభిప్రాయపడ్డాడు. 


ఐపిఎల్ 2022 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కేప్టేన్‌ని కూడా ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తున్నప్పటికీ.. ఒకవేళ వచ్చే ఏడాది కూడా ఆ జట్టు యుజ్వేంద్ర చాహల్‌ని తీసుకున్నట్టయితే.. విరాట్ కోహ్లీ స్థానంలో జట్టును ముందుండి నడిపించే సత్తా కూడా అతనికి (Yuzvendra Chahal to lead RCB ?) ఉందని రణ్‌ధీర్ సింగ్ గుర్తుచేశాడు. 


'' రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో (Royal Challengers Bangalore) ఉన్న సీనియర్ ఆటగాళ్లలో చాహల్ కూడా ఒకరు. పైగా జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరితో కలిసిపోతాడు. అంతేకాకుండా ఎన్నోసార్లు విరాట్ కోహ్లీ కూడా చాహల్ బౌలింగ్‌పై ఆధారపడిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో తన విషయంలో తన కేప్టేన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదని చాహల్ కూడా నిరుపిస్తూనే వచ్చాడు'' అంటూ చాహల్ ప్రతిభపై రణ్‌ధీర్ ధీమా వ్యక్తంచేశాడు.