RCB all set to name Faf du Plessis as new captain for IPL 2022: ఐపీఎల్ 2022కు సమయం దగ్గరపడుతోంది. మరో 18 రోజుల్లో మెగా లీగ్‌కు తెరలేవనుంది. మార్చి 26న ఆరంభం అయి.. మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండు సీజన్లు యూఏఈలో జరగ్గా.. ఈసారి భారత్ వేదికగానే జరగనుంది. ఈసారి రెండు కొత్త జట్లు వచ్చిన నేపథ్యంలో ఇటీవల మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. దాంతో అన్ని జట్లలోని ఆటగాళ్లు మారిపోయారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కు కొత్త కెప్టెన్ అవసరం ఏర్పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో ఆర్‌సీబీ తన మొదటి మ్యాచ్‌ని మార్చి 27న పంజాబ్ కింగ్స్‌తో ఆడుతుంది. అయితే ఇప్పటివరకు కూడా బెంగళూరు యాజమాన్యం తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ని ప్రకటించలేదు. దాంతో ఆర్‌సీబీ కొత్త కెప్టెన్ ఎవరు, ఎప్పుడు ప్రకటిస్తారు అనే ఆసక్తి ప్రతిఒక్కరిలో నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొత్త కెప్టెన్‌ పేరుని ఈ నెల 12న సాయంత్రం 4 గంటలకు ఆర్‌సీబీ యాజమాన్యం ప్రకటించనుందట. కొత్త కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్‌ను నియమిస్తున్నామని విలేకరుల సమావేశంలో ప్రకటిస్తారని సమాచారం. 


ఆర్‌సీబీ వర్గాల సమాచారం ప్రకారం.. దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్ కావడం దాదాపు ఖాయం అయిందట. ఆర్‌సీబీ సమావేశంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ పేరు కూడా చర్చల్లోకి వచ్చినా.. చివరికి డుప్లెసిస్ పేరునే ఫైనల్ చేశారని సమాచారం. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా డుప్లెసిస్‌కు ఓటేశాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మార్చి 12న సాయంత్రం 4 గంటలకు అధికారికంగా వెల్లడించనుందట. అదే సమయంలో తమ కొత్త జెర్సీని కూడా లాంచ్ చేస్తుందట.



ఫాఫ్ డుప్లెసిస్ టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రొటీస్ తరఫున 37 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి.. 23 మ్యాచ్‌లలో విజయాలు అందుకున్నాడు. 13 మ్యాచుల్లో దక్షిణాఫ్రికా ఓడిపోగా.. 1 మ్యాచ్ టై అయింది. గతేడాది ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఆడిన డుప్లెసిస్‌ 16 మ్యాచ్‌ల్లో 45.21 సగటుతో 633 పరుగులు చేశాడు. ఇక 2013 సీజన్‌లో ఆర్‌సీబీకి కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ.. 2021 వరకు కొనసాగాడు. పనిభారం అధికం అవడంతో కెప్టెన్సీ వదిలేశాడు. విరాట్ కెప్టెన్సీలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయాడు. 2016లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ ట్రోఫీని గెలవలేకపోయింది.


Also Read: మీరు ఎవరు కష్టపడినా.. మా అమ్మే గుర్తుకు వస్తుంది! భావోద్వేగం చెందిన మెగాస్టార్ చిరంజీవి!!


Also Read: Chance to Meet Prabhas: రాధేశ్యామ్ ఎన్ఎఫ్‌టి లాంచ్ నేడే, ప్రభాస్‌ను నేరుగా కలిసేందుకు అవకాశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook