RCB Vs DC WPL Final 2024: డబ్ల్యూపీఎల్ ఫైనల్ పోరు.. ఢిల్లీని మట్టికరిపిస్తే ఆర్సీబీదే టైటిల్
Royal Challengers Bangalore Vs Delhi Capitals: డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న ఆర్‌సీబీ.. ఢిల్లీని మట్టికరిపించి ట్రోఫీని ముద్దడాలని చూస్తోంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎంచుకుంది.
Royal Challengers Bangalore Vs Delhi Capitals: డబ్ల్యూపీఎల్ 2024 రెండో సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఫైనల్ ఫైట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఫైనల్ పోరుకు ఢిల్లీ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోగా.. బెంగుళూరు జట్టు ఒక మార్పు చేసింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ముఖాముఖి నాలుగు మ్యాచ్‌ల్లో తలపడగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీనే గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్‌లోనూ ఢిల్లీ అదే జోరు కొనసాగించాలని భావిస్తుండగా.. తొలిసారి ఫైనల్‌కు చేరిన ఆర్‌సీబీ ఎట్టిపరిస్థితుల్లోనూ కప్ కొట్టి ఫ్రాంచైజీకి గిఫ్ట్ ఇవ్వాలని చూస్తోంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.
డబ్ల్యూపీఎల్ 2023లో ప్రారంభం కాగా.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించి.. తొలి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. గత సీజన్‌లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన ఆర్‌సీబీ.. ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ఈసారి అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరింది. మరోవైపు గతేడాది తృటిలో కప్ చేజార్చుకున్న ఢిల్లీ మళ్లీ అదే పంతంతో ఆడి ఫైనల్‌కు చేరింది. రెండు జట్ల మధ్య ఫైట్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా సాగనుంది.
తుది జట్లు ఇలా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ మోలినక్స్, జార్జియా వేర్‌హామ్, దిశా కసత్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్
ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా (వికెట్ కీపర్), శిఖా పాండే, మిన్ను మణి.
Also Read: Narendra Modi: మాకు 400 సీట్లు ఇస్తే వికసిత్ భారత్.. వికసిత్ ఏపీ సాధ్యం: ప్రధాని మోదీ
Also Read: Summer Heat Stroke: దంచికొడుతున్న ఎండలు.. ఈ సింప్టమ్స్ కన్పిస్తే వడదెబ్బ తగిలినట్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter