RCB Vs KKR IPL 2024 Updates: టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా.. అందరి దృష్టి గంభీర్, కోహ్లీ
RCB Vs KKR IPL 2024 Updates All Eyes On Virat Kohli Gautam Gambhir: ఐపీఎల్ సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు వేళయింది. కేకేఆర్ వర్సెస్ ఆర్‌సీబీ మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో అందరి దృష్టి విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌పైనే ఉంది.
RCB Vs KKR IPL 2024 Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో మరో రసవత్తర పోరుకు వేళయింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం జరుగనున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోల్‌కత్తా నైట్ రైడర్స్‌ను ఢీకొట్టనుంది. గత మ్యాచ్ విజయంతో జోరు మీద ఉన్న కోహ్లీ సేన.. కేకేఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిన బెంగళూరు రెండో మ్యాచ్‌లో గుజరాత్‌పై గెలిచి సత్తా చాటింది. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో కోల్‌కత్తాను ఓడించి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టాస్ కార్యక్రమంలో కేకేఆర్ టాస్ నెగ్గి బౌలింగ్‌కు ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్‌ను బెంగళూరు ప్రారంభించనుంది.
Also Read: RR vs DC Live: పరాగ్ విధ్వంసంతో రాజస్థాన్ అ'ద్వితీయ' విజయం.. ఢిల్లీకి తప్పని నిరాశ
ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. ముఖ్యంగా చెప్పాలంటే కోల్‌కత్తాకు కీలక మ్యాచ్‌గా మారింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటిన కేకేఆర్ రెండో మ్యాచ్‌లో ఆర్‌సీబీని చిత్తు చేయాలని చూస్తోంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీపై కేకేఆర్ ఎప్పుడూ పైచేయి సాధిస్తూ ఉంటుంది. ఈసారి కూడా అదే పునరావృతం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. తన తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి విజయోత్సాహంతో ఉన్న కోల్‌కత్తా కోహ్లీ సేనను కూడా ఓడిస్తామనే ధీమాలో ఉంది.
Also Read: SRH vs MI: చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. ముంబైని ఊచకోత కోసి సన్‌రైజర్స్ గ్రాండ్ విక్టరీ
అందరి దృష్టి వారిమీదే..
మ్యాచ్ పేరుకు ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్‌గా కనిపిస్తున్నా వాస్తవంగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌గా కనిపిస్తోంది. గతంలో కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం, గొడవలు జరిగిన విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరూ మైదానంలో గొడపడ్డారు. గత సీజన్‌లో కూడా కోహ్లీతో గంభీర్ దురుసుగా వ్యవహరించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. గతంలో లక్నోకు మెంటర్‌గా వ్యవహరించిన గంభీర్ ఇప్పుడు కోల్‌కత్తాకు మారాడు. కోహ్లీ జట్టు ఆర్‌సీబీతో గంభీర్ మెంటార్‌గా ఉన్న కేకేఆర్ మ్యాచ్ ఆడనుండడంతో అందరి దృష్టి వారిద్దరిపై ఉంది. మ్యాచ్‌లో ఏం జరుగుతుందా? అనేది ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో మాదిరి రెచ్చగొట్టడం, దురుసుగా ప్రవర్తించడం వంటివి చేస్తే ఈసారి గంభీర్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు కోహ్లీ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే అలాంటి చేయొద్దని కోహ్లీ తన అభిమానులకు ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook