Virat Kohli Video Call: గ్రౌండ్‌లోనే వీడియో కాల్ చేసిన విరాట్ కోహ్లీ.. ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ..!
RCB Vs PBKS IPL 2024 Highlights: పంజాబ్‌పై మ్యాచ్ గెలిచిన తరువాత విరాట్ కోహ్లీ తెగ సంబరపడిపోయాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం కుటుంబంతో వీడియో కాల్ మాట్లాడాడు. కోహ్లీ ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
RCB Vs PBKS IPL 2024 Highlights: పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల ఖాతాను ఓపెన్ చేసింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఒంటి చెత్తో మాస్టర్ స్ట్రోక్ ఇన్నింగ్స్ జట్టు విజయానికి బాటలు వేశాడు. చివర్లో దినేశ్ కార్తీక్, మహిపాల్ లోమ్రార్ అద్భుత ఫినిషింగ్‌తో జట్టును గెలిపించారు. 49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరగులు చేసిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అవార్డు అనంతరం భార్య అనుష్క శర్మ, కొడుకు, కూతురితో వీడియో కాల్ మాట్లాడాడు. కోహ్లీ లండన్‌లో ఉన్న తన కుటుంబంతో మాట్లాడిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కోహ్లీ ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ ఎంతో ఆనందంగా కనిపించాడు.
కోహ్లీ భార్య అనుష్క శర్మ ఫిబ్రవరి 15వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తమ బాబుకు అకాయ్ కోహ్లీ అని నామకరణం చేశారు కోహ్లీ దంపతులు. అఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్ మధ్యలో వెళ్లిపోయిన కోహ్లీ.. ఆ తరువాత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. దాదాపు రెండు నెలల తరువాత ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లో తక్కువ స్కోరు చేసినా.. రెండో మ్యాచ్‌లో మాత్రం తన బ్యాటింగ్‌తో దుమ్ములేపాడు. టీ20 వరల్డ్ కప్ నుంచి కోహ్లీని తప్పిస్తారనే వార్తల నేపథ్యంలో కోహ్లీ తన ఇన్నింగ్స్‌తో సమాధానం చెప్పాడు. టీ20 కెరీర్‌లో 92 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఆర్‌సీబీ తరుఫున 51 అర్ధ సెంచరీలు బాదాడు.
చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (45) మాత్రమే రాణించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. చివరి ఓవర్‌లో సుశాంక్ సింగ్ చెలరేగి ఆడి 20 పరుగులు చేయడంతో పంజాబ్ స్కోరు 176 రన్స్‌కు చేరింది. అనంతరం ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీకి తోడు చివర్లో దినేశ్ కార్తీక్ (28), మహిపాల్ లోమ్రార్ (17) మెరుపులు మెరిపించి జట్టుకు విజయాన్ని అందించారు.
Also Read: Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి