శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా సారథి రోహిత్‌ శర్మ (208 నాటౌట్‌; 153 బంతుల్లో 13×4, 12×6) తన సత్తా చాటాడు. వన్డే క్రికెట్‌లో రికార్డు స్థాయిలో మూడో డబుల్‌ సెంచరీ సాధించి చరిత్రను తిరగరాశాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 209 పరుగులు చేసిన రోహిత్,  2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు చేయడం గమనార్హం. ఇది ఆయన కెరీర్‌లో మూడవ డబుల్ సెంచరీ. ఈ వన్డేలో మొదటి నుంచీ దూకుడుగా ఆడిన రోహిత్, నాటౌట్‌గా నిలిచి తన అభిమానులను అలరించడం విశేషం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం శ్రీలంకతో మొహాలీ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో ద్విశతకం సాధించిన రోహిత్‌కు ఇతర ఆటగాళ్లు కూడా సహకారం అందించడంతో భారత్, నాలుగు వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది.  శ్రేయస్‌ అయ్యర్‌ (88; 70 బంతుల్లో 9×4, 2×6), శిఖర్‌ ధావన్‌ (68; 67 బంతుల్లో 9×4) అర్ధశతకాలతో సహకారం అందించడంతో టీమిండియా భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. ఈ వన్డేలో శ్రీలంక సారథి తిసారా పెరీరా మూడు వికెట్లు పడగొట్టాడు.