Ind Vs Zim: జింబాబ్వేతో భారత్ పోరు.. ఆ ఇద్దరికి ఛాన్స్ ఇస్తారా..? తుది జట్లు ఇవే..
India Vs zimbabwe Playing 11: టీమిండియా సెమీస్‌కు ఒక అడుగు దూరంలో ఉంది. నేడు జింబాబ్వేతో తలపడనుంది. తుది జట్లపై ఓ లుక్కేద్దాం..
India Vs zimbabwe Playing 11: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌కు రెడీ అయింది. ఆదివారం జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ విజయం సాధించి గ్రూప్-2 నుంచి టాపర్‌గా సెమీస్ బెర్త్ ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటోంది. మెల్‌బోర్న్ వేదికగా రెండు జట్ల మధ్య రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టీ20ల్లో జింబాబ్వేపై భారత్‌కు 5-2 రికార్డు ఉంది. ఈ ఫార్మాట్‌లో రెండు జట్ల 2016లో మ్యాచ్ జరిగింది. T20 ప్రపంచకప్‌లో తలపడడం ఇదే తొలిసారి. రెండు జట్ల కుర్పుపై ఓ లుక్కేద్దాం..
ఈ టీ20 ప్రపంచకప్‌లో పవర్‌ప్లేలో టీమిండియాకు ఒక్కసారి కూడా మంచి ఆరంభం దక్కలేదు. బంగ్లాదేశ్‌పై కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి రాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. అతడి బ్యాట్ నుంచి పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. సెమీస్ ఫైనల్‌కు ముందు ఓపెనింగ్ జోడి గాడిన పడాల్సిన అవసరం ఉంది.
ఇక విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. టాప్-4 రాణిస్తే.. భారీ స్కోరు ఖాయం. అదేవిధంగా హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్‌ల కూడా రాణించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దినేష్ కార్తీక్ తన బ్యాట్‌తో సూపర్ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది.
ప్రస్తుతం భారత్ బౌలింగ్ అత్యుత్తమంగా ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ను మినహాయించి.. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కొత్త బంతితో.. డెత్ ఓవర్లలో చెలరేగిపోతున్నాడు. చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తు వికెట్లు పడగొడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో అర్ష్‌దీప్ ఇప్పటివరకు 9 వికెట్లు పడగొట్టాడు. షమీ, భువనేశ్వర్ కూడా చక్కగా రాణిస్తున్నారు. స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ టోర్నీలో ఒక్కసారిగా కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పే వికెట్లు తీయలేదు. మరోవైపు రిషబ్, చాహల్ తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్స్ వస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి.
మరోవైపు జింబాబ్వే కూడా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆల్ రౌండర్ సికందర్ రజా తన అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్, షాన్ విలియమ్స్, వెస్లీ మాధేవెరే, ర్యాన్ బర్లే నుంచి కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు. తమను తేలిగ్గా తీసుకున్న పాకిస్థాన్ జట్టుకు జింబాబ్వే షాకిచ్చిన విషయం టీమిండియా మార్చిపోకూడదు. ఏమాత్రం అలసత్వం వహించకుండా.. స్థాయికితగ్గ ప్రదర్శన చేస్తే గెలుపు సులభమే. చిన్నఛాన్స్ దొరికినా.. భారత్‌కు చెక్ పెట్టేందుకు జింబాబ్వే సిద్ధంగా ఉంది.
తుది జట్లు (అంచనా):
ఇండియా: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్/రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్/చాహల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.
జింబాబ్వే: రెగిస్ చకబ్వా (వికెట్ కీపర్), క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), మిల్టన్ శుంబా, వెస్లీ మాధేవెరే, సీన్ విలియమ్స్, సికందర్ రజా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, రిచర్డ్ నగరవ, టెండై చతారా, బ్లెస్సింగ్ ముజారబానీ.
Also Read: Virat Kohli Birthday Special: వెరైటీ ఫొటోలు షేర్ చేసిన అనుష్క శర్మ.. చూస్తే నవ్వు ఆపుకోలేరు
Also Read: Twitter Layoffs: సినిమా స్టైల్లో ఎలెన్ మస్క్ మెయిల్.. దయచేసి ఇంటికి వెళ్లండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి