India's Squad for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతోంది. అన్ని జట్లు తమ టీమ్స్ ను ప్రకటించేందుకు సిద్దమవుతున్నాయి. ఈ రెండు రోజుల్లో బీసీసీఐ కూడా భారత జట్టును ప్రకటించనుంది. జూన్ 01 నుంచి ఈ మెగా టోర్నీని అమెరికా, వెస్టిండీస్‌ దేశాలు నిర్వహించనున్నాయి. ఈసారి ఎప్పుడూ లేని విధంగా 20 జట్లు పాల్గొంటున్నాయి. మీడియా కథనాల ప్రకారం, ఐపీఎల్ మధ్యలోనే ప్రపంచ కప్‌నకు భారత జట్టు బయలుదేరవచ్చని తెలుస్తోంది. మే 21న టీమిండియా అమెరికా ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉందని సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ఎలా ఉండబోతుందా అని అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికే అదే పనిలో సెలెక్టర్లు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ త్వరలోనే తుది జట్టును ప్రకటించనుంది. అయితే బ్యాటర్లు, బౌలర్లు ఎంపిక పెద్దగా ఇబ్బందిలేకపోయినప్పటికీ.. వికెట్ కీపర్స్ సెలెక్టర్లను గందరగోళంలో పడేస్తున్నారు. ఈ సారి ముగ్గురు మధ్య పోరు తీవ్రంగా ఉంది. చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నాడు. సెలక్టర్లు తొలి ఛాయిస్ ఇతడే కనిపిస్తున్నాడు.


తలనొప్పిలా మారిన ఆ ఇద్దరు?
మరోపక్క  కెప్టెన్ గా, బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు సంజూ శాంసన్. ఇతడి తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కేఎల్ రాహుల్. రాహుల్ కూడా ఈ ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ముగ్గురు అద్భుతంగా రాణిస్తుండటంతో ఎవరినీ ఎంపిక చేయాలనే విషయంలో సెలెక్టర్లు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. పంత్ పిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరో స్థానం కోసం రాహుల్, శాంసన్ పోటీ పడుతున్నారు. మరి ఎవరినీ ఎంపిక చేస్తారో వేచి చూడాలి.


Also Read: MS Dhoni: ధోని మాస్టర్ ప్లాన్‌కు షాకైన కావ్య మారన్.. పక్కా ప్లాన్‌తో ట్రావిస్ హెడ్‌కు గాలం


టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఐర్లాండ్ తో జూన్ 05న ఆడబోతుంది. తర్వాత మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జూన్ 09న తలబోడుతుంది. ఈ పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. టీమిండియా తన తొలి మూడు మ్యాచులను  న్యూయార్క్‌లో ఆడనుంది. 


Also Read: T20 World Cup 2024: గిల్, రాహుల్‌కు నో ఛాన్స్.. టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగబోయే భారత జట్టు ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter